లోకేష్ పాదయాత్రలో నడుస్తా !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్లో యువగళం పాదయాత్ర చేసిన నారా లోకేష్, స్ధానిక వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. హఫీజ్ ఖాన్ స్దానికంగా ఉన్న పలు స్ధలాల్ని ఆక్రమించుకుంటున్నట్లు లోకేష్ ఆరోపణలు చేశారు. దీంతో లోకేష్ ఆరోపణలపై స్ధానికంగా చర్చ మొదలైంది.  పాదయాత్రలో నారా లోకేష్ తనపై చేసిన భూకబ్జా ఆరోపణలపై కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఫైర్ అయ్యారు. భూకబ్జాలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. అలాగే లోకేష్ తో కలిసి పాదయాత్రలో నడుస్తానంటూ సవాల్ విసిరారు. తాను అమెరికాలో లగ్జరీ లైఫ్ వదులుకుని ప్రజా సేవ కోసం కర్నూలు వచ్చానంటూ హఫీజ్ ఖాన్ వెల్లడించారు. కర్నూలుకు అన్యాయం చేసిన ఘనత టీడీపీది అన్నారు. నాలుగేళ్లుగా కర్నూలకు తాను ఎంతో సేవ చేశానన్నారు. ఇప్పటికే లోకేష్ పాదయాత్ర చేసిన అన్ని నియోజకవర్గాల్లోనూ స్ధానిక వైసీపీ ఎమ్మెల్యేలపై ఆయన కబ్జాల ఆరోపణలు చేస్తున్నారు. ఇందుకు దగ్గ ఆధారాలు కూడా బయటపెడుతున్నారు. దీంతో స్ధానికంగా వీటిపై తీవ్ర చర్చ జరుగుతోంది. లోకేష్ ఆరోపణలపై స్పందిస్తూ పలువులు ఎమ్మెల్యేలు ఇప్పటికే తాము సచ్చీలురమని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొందరు తాము చేయని పనుల్ని తమకు అంటగడుతున్నారంటూ కౌంటర్లు ఇస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)