ది కేరళ స్టోరీ సినిమా నిర్మాతను బహిరంగంగా ఉరి తీయాలి !

Telugu Lo Computer
0


ది కేరళ స్టోరీ సినిమా నిర్మాతను బహిరంగంగా ఉరి తీయాలంటూ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి జితేంద్ర అవ్హాద్ డిమాండ్ చేశారు. కేరళకు చెందిన 32,000 మంది మహిళలు తప్పిపోయి ఐసిస్‌లో చేరినట్లు ఓ ఊహాజనిత కథను సృష్టించి, సినిమా పేరుతో జనం మీదికి వదిలారని విమర్శించారు. ఈ సినిమా కథాంశం మొత్తం ఫిక్షన్ అని కొట్టి పారేశారాయన. కేరళ స్టోరీ పేరుతో మన ఆడపిల్లల పరువును మనమే తీస్తోన్నామంటూ జితేంద్ర అవ్హాద్ ధ్వజమెత్తారు. మన ఆడపిల్లలు మూర్ఖులుగా, ఏమీ అర్థం చేసుకోలేని బలహీన మనస్కులుగా, పురుషాధిక్య సమాజంలో బందీలుగా చిత్రీకరించారని ఆరోపించారు. మత విధ్వేషాలను రెచ్చగొట్టడం, హింసను సృష్టించడం, ఎన్నికల్లో లబ్దిపొందాలనే ఉద్దేశంతో ఈ సినిమాను తీసినట్లు చెప్పారు. ది కేరళ స్టోరీ సినిమా ఆ రాష్ట్రంలో నివసించే మహిళలను పరువు తీస్తోందని జితేంద్ర అవ్హాద్ ధ్వజమెత్తారు. కల్పిత కథతో సినిమా తీసిన నిర్మాతను బహిరంగంగా ఉరితీయాలని అన్నారు. ఈ సినిమాను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్దేశించడాన్ని ఆయన స్వాగతించారు. ఈ సినిమాను నిషేధించి ముఖ్యమంత్రి మమత బెనర్జీ మంచి నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)