తాత్కాలిక మోటార్లతో హైదరాబాద్​కు నీటి సరఫరా

Telugu Lo Computer
0


తెలంగాణ లోని సిద్ధిపేట జిల్లా చిన్న కోడూరు మండలం మల్లారం వద్ద నీట మునిగిన పంప్ హౌస్ లో సోమవారం తాత్కాలిక మోటార్లను బిగించి పంపింగ్ ప్రారంభించారు. హైదరాబాద్ కు నీటి సరఫరా చేసే మల్లారం పంప్ హౌస్ లో మొత్తం తొమ్మిది మోటార్లుండగా, ఆదివారం సాంకేతిక కారణాలతో పంప్​హౌస్ లోకి నీళ్లు వెళ్లి ఆరు మోటార్లు మునిగిపోయాయి. దీంతో సోమవారం యుద్ధ ప్రాతిపదికన కరీంనగర్ నుంచి మూడు మోటార్లను తెప్పించిన అధికారులు నీటిని తొలగించి మునిగిన మోటార్లను తీశారు. వాటి స్థానంలో తాత్కాలికంగా తెచ్చిన మూడు మోటార్లను బిగించి పంపింగ్ ప్రారంభించారు. దెబ్బతిన్న ఆరు మోటార్లను రిపేర్ల కోసం హైదరాబాద్ పంపించారు. ప్రస్తుతం ఆరు మోటార్లతో పంపింగ్ చేస్తూ హైదరాబాద్ కు నీటి సరఫరా పునరుద్ధరించారు. ఆరు మోటార్లు దెబ్బతినడంతో భారీ నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)