సీబీఐ రెండో ఛార్జిషీట్ లో కవిత పేరు చేర్చలేదు !

Telugu Lo Computer
0


ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ దాఖలు చేసిన రెండో ఛార్జిషీట్ ను ప్రత్యేక కోర్టు పరిగణలోకి తీసుకుంది. సీబీఐ తాజా ఛార్జిషీటులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు ఎక్కడా చేర్చలేదు. కవితను ప్రశ్నించినప్పటికీ ఇప్పటి వరకు సీబీఐ ప్రశ్నించిన జాబితాలో కూడా ఆమె పేరు లేదు. ఏప్రిలో 25న సీబీఐ అనుబంధ ఛార్జిషీటును దాఖలు చేసింది. సుమారు 5 వేల 700 పేజీలతో రెండో ఛార్జిషీటును సీబీఐ దాఖలు చేసింది. మొదటి ఛార్జిషీట్ ను నవంబర్ 25న దాఖలు చేసింది. ఆ తరువాత డిసెంబర్ 11న కవితను హైదరాబాద్ లో సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఇప్పటివరకు ప్రశ్నించిన 89 మంది వివరాలను ఛార్జ్ షీట్ లో ప్రస్తావించింది. మే 4వ తేదీన 4వ అనుబంధ అభియోగ పత్రాన్ని ఈడీ దాఖలు చేసింది. 270 ప్రధాన పత్రాలు, సుమారు 2 వేల అనుబంధ పేజీలతో నాల్గవ అదనపు ఛార్జిషీటు దాఖలు చేసింది ఈడీ. మే 30వ తేదీన ఈడీ ఛార్జిషీటును పరిగణనలోకి తీసుకోవడంపై ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు వెలువరించనుంది. రెండు ఛార్జిషీట్లలోనూ ప్రధానంగా సీబీఐ, ఈడీ మనీష్ సిసోడియాపైనే అభియోగాలు నమోదు చేశాయి. ఈడీ తాజా ఛార్జిషీట్ లోనూ కవితపై రోటిన్ అభియోగాలనే మోపినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ కేసు దర్యాప్తులో భాగంగా గతంలో సీబీఐ, ఈడీ అధికారులు కవితను ప్రశ్నించిన విషయం తెలిసిందే. 

Post a Comment

0Comments

Post a Comment (0)