మరో గ్యాంగ్‌స్టర్‌ను ఎన్‌కౌంటర్

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్‌లో మీరట్‌కు చెందిన స్టేట్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గ్యాంగ్ స్టర్ అనిల్ దుజానాను ఎన్ కౌంటర్ చేశారు. మీరట్ శివార్లల్లో చోటు చేసుకున్న ఎదురు కాల్పుల్లో అనిల్ దుజానా మరణించినట్లు ఉత్తరప్రదేశ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ తెలిపారు. ఈ ఘటనతో మీరట్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా మీరట్ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. గ్యాంగ్ స్టర్ అనిల్ దుజానాపై వివిధ పోలీస్ స్టేషన్లలో 62 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అందులో 18 మర్డర్ కేసులు ఉన్నాయి. దోపిడీలు, దొంగతనాలు, భూ కబ్జాలు వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవాడు. ఇందుకోసం ఉత్తరప్రదేశ్ పశ్చిమ ప్రాంతంలో పలు చోటల్ ముఠాలను ఏర్పాటు చేసుకున్నాడు. గత కొంతకాలంగా అనిల్ దుజానా కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అనిల్ దుజానాను పట్టించిన వారికి రూ.50వేల బహుమానాన్ని కూడా ప్రకటించారు. గత ఏడాది డిసెంబర్ లో ఢిల్లీలో పోలీసులు అనిల్ దుజానాను అరెస్ట్ చేశారు. మయూర్ విహార్ ప్రాంతంలో సెటిల్ మెంట్ కోసం వచ్చిన అనిల్ దుజానాను పోలీసులు చాకచాక్యంగా అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఎస్టీఎఫ్ పోలీసులు దుజానాను ఎన్ కౌంటర్ చేశారు. గతంలో సమాజ్ వాది ప్రభుత్వం గ్యాంగ్ స్టర్లను పెంచి పోషించిందని, తమ హయంలో వారందరూ ప్రాణభిక్ష పెట్టాలంటూ వేడుకుంటున్నారని ఈ మధ్యే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. ఈ మధ్యే ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో సమాజ్‌వాది పార్టీ మాజీ లోక్‌సభ సభ్యుడు అతిక్ అహ్మద్, అతని తమ్ముడు అష్రాఫ్ అహ్మద్ దారుణ హత్యకు గురయ్యారు. దానికి కొద్ది రోజుల ముందే అతిక్ అహ్మద్ కొడుకు అసద్ అహ్మద్‌ను ఎన్‌కౌంటర్ చేశారు. ఇప్పుడు తాజాగా మరో గ్యాంగ్‌స్టర్‌ను స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)