చంద్రబాబు బండారం బయటపడనుంది ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday 3 May 2023

చంద్రబాబు బండారం బయటపడనుంది !


ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు జీవితమే అవినీతిమయం, దేనిపై స్టే తెచ్చుకోవడమే చంద్రబాబు జీవితం అని సెటైర్లు వేశారు. 1996లో 350కోట్ల స్కామ్ జరిగితే అప్పట్లో చంద్రబాబు స్టే తెచ్చుకున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటియంలా వాడుకున్నారని ప్రధాని నరేంద్ర మోడీ సైతం చెప్పారన్న ఆయన, చంద్రబాబుకు రెండెకరాల నుంచి లక్షలకోట్ల ఆస్తులు ఎలావచ్చాయనే దానిపై విచారణ జరగాలన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో చంద్రబాబు ఎంత అవినీతిపరుడో బట్టబయలవుతుందని హెచ్చరించారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటుపడిచిన చంద్రబాబు ఎన్నికలు రాగానే ఆయన్ని పొగుడుతూ ఉంటారని ఎద్దేవా చేశారు. ఇక, అమరావతిలో తాత్కాలిక కట్టడాలపేరుతో 11 వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసారు.. చిన్నపాటి వర్షాలకే అక్కడ భవనాలు కారిపోతుంటాయన్నారు. గత ప్రభుత్వ అవినీతిపై ‘సిట్’ అంశంపై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటుపై ‘స్టే’ విధిస్తూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టు నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంలో సవాల్‌ చేయగా, ఇప్పటికే వాదనలు విన్న జస్టిస్ ఎం.ఆర్. షా నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజు తీర్పు ఇచ్చింది.

No comments:

Post a Comment