హైదరాబాద్‌ షాపింగ్‌ మాల్స్‌లో ఐటీ సోదాలు

Telugu Lo Computer
0


హైదరాబాద్‌, జూబ్లీహిల్స్‌లోని వరమహాలక్ష్మీలో ఐటీ అధికారుల బృందం తనిఖీలు చేస్తోంది. ఐదు రోజుల సెర్చ్‌ వారెంట్‌తో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. సోదాల సందర్బంగా సంస్థ ఇప్పటి వరకు చేసిన ఐటీ చెల్లింపులపై అధికారులు ఆరా తీస్తున్నారు. లాగ్‌ షీట్స్‌, ఆడిటింగ్‌ వివరాలను పరిశీలిస్తున్నారు. ఈ సందర్బంగా సంస్థ ఫైనాన్స్‌ మేనేజర్లను సైతం అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో సీఆర్‌పీఎఫ్‌ పోలీసులు.. కస్టమర్లను లోపలికి అనుమతించడం లేదు. ఫిలిం నగర్‌, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. కళామందిర్‌ గ్రూప్స్‌, వరమహాలక్ష్మీ, కేఎల్‌ఎం, కాంచీపురం అనుబంధ వ్యాపార సంస్థల లెక్కలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)