బంగారు పొడిని పట్టుకున్న కస్టమ్స్ అధికారులు !

Telugu Lo Computer
0


దుబాయ్ నుండి హైదరాబాద్ – శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వచ్చిన కేరళ ప్రయాణికుడు బంగారాన్ని పొడిగా తయారు చేసి తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు దొరికిపోయాడు. నిందితుడి వద్ద నుండి 1761 గ్రాముల అక్రమ బంగారం స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ దాదాపు 1.10 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. బంగారం స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు నిందితున్ని విచారణ చేపట్టారు. దుబాయ్ నుంచి తరలించే ముందు అక్కడ ఎవరు ఎందుకు పట్టించుకోలేదు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం ఎప్పటి నుంచి జరుగుతుందని ఆరా తీస్తున్నారు. దీని వెనుక ఎవరెవరు వున్నారు? హైదరాబాద్‌ లో ఎవరెవరితో నిందితుడు కాంటాక్ట్‌ లో వున్నాడో దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)