అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

Telugu Lo Computer
0


కర్ణాటకలోని కొడగు జిల్లా పొన్నంపేటె తాలూకాలోని హుదికెరె దగ్గర  బెళలూరు గిరిజన హాడికి చెందిన చోందు శనివారం అర్ధరాత్రి ఇంటిలో నుంచి బయటకి వెళ్ళి మళ్లీ కనిపించలేదు. ఫణి రాజు భార్య చోందు (25) మృతదేహం భాగాలు కాళ్ళు, చేతులను, దుస్తులను ఇంటి వెనుక ఉన్న కాఫీ తోటలో గుర్తించారు. ఆదివారం తెల్లవారుజామున భర్త వెతుకుతూ వెళ్లగా ఇంటి వెనుక సుమారు 500 మీటర్ల దూరంలో పొదల్లో కాళ్లు, చేతులు, బట్టలు, కొన్ని ఎముకలు మాత్రమే కనిపించాయి. భర్త గట్టిగా కేకలు వేయడంతో అందరూ అక్కడికి చేరుకుని భయాందోళనకు గురయ్యారు. హతురాలి సోదరి నేత్ర శ్రీమంగళం పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు వచ్చి పరిశీలించి కేసు నమోదు చేశారు. ఎవరైనా హత్య చేశారా, లేక ఆమె బహిర్భూమికని బయటకు వెళ్లినప్పుడు పులి, చిరుత వంటివి దాడి చేసి చంపేశాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)