ఎమ్మెల్యే అయితే ఏంటి ? వచ్చి క్యూలో నిలబడు !

Telugu Lo Computer
0


బెంగళూరు దక్షిణ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎం. క్రిష్ణప్ప బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. బెంగళూరు దక్షిణ నియోజక వర్గంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో రౌండ్స్ వేసిన ఎం. క్రిష్ణప్ప తరువాత బనశంకరి రెండో స్టేజ్ లోని బూత్ నెంబర్ 145 వద్దకు వచ్చారు. ఇదే బూత్ లో ఆయనకు ఓటు హక్కు ఉంది. ఒకవైపు ఎండ మరోవైపు భారీ క్యూలైన్ ఉన్నప్పటికీ తమ వంతు కోసం ఓటర్లు ఓపికగా ఎదురు చూస్తున్నారు. అయితే క్రిష్టప్ప మాత్రం కారు దిగి నేరుగా పోలింగ్ బూల్ లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. అది చూసిన ఓటర్లు ఆయనపై ఆగ్రహం వ్యక్తంచేశారు. క్యూలైన్ లో వెళ్లి ఓటు వేయాలని చెప్పారు. దీంతో ఎమ్మెల్యే వారితో వాగ్వాదానికి దిగారు. చివరకు చేసేదేంలేక ఆయన క్యూలైన్ లో వెళ్లి ఓటు వేశారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నిల్లో బెంగళూరు దక్షిణ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన ఎం. క్రిష్ణప్ప ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయనపై కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆర్ కే. రమేష్ 30, 417 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

Post a Comment

0Comments

Post a Comment (0)