ప్రేమికులను చంపి చెట్టుకు వేలాడదీశారు !

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ జిల్లాలో ఓ గ్రామానికి చెందిన 19 సంవత్సరాల యువకుడు, అగ్రకులానికి చెందిన 17 ఏళ్ల బాలిక ప్రేమించుకున్నారు. ఈ విషయం ఇటీవల బాలిక కుటుంబ సభ్యులకు తెలిసింది. దళిత కులానికి చెందిన యువకుడిని తమ కుమార్తె ప్రేమించడం ఆ తల్లిదండ్రులకు నచ్చలేదు. పరువు పోయినట్లుగా భావించారు. తమ కుమార్తెను ప్రేమలోకి లాగిన యువకుడిని చంపేయాలని నిర్ణయించుకున్నారు. బాలిక తల్లిదండ్రులు, బంధువులు యువకుడిని కిడ్నాప్ చేసి మామిడి తోటలోకి తీసుకువచ్చారు. అక్కడ అతడిని చిత్రహింసలు పెట్టి హత్య చేశారు. అంతటితో ఆగని తల్లిదండ్రులు బాలికను కూడా మామిడి తోట వద్దకు తీసుకువచ్చారు. కన్న కుమార్తె అని కూడా జాలి చూపించలేదు. ఆమెను కూడా దారుణంగా హతమార్చారు. ఆ తర్వాత ఈ నేరం తమ మీద పడకూడదని ప్లాన్ వేశారు. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఇద్దరి మృతదేహాలను చెట్టుకు వేలాడదీశారు. మంగళవారం మామిడి తోటలోకి వచ్చిన కొందరికి మృతదేహాలు ఉరికి వేలాడుతూ కనిపించాయి. వారిచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అమ్మాయి కుటుంబ సభ్యులే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. పోలీసులు బాలిక తండ్రి సహా ఏడుగురిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి గురువారం నలుగురు నిందితులను అరెస్టు చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)