మరో మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలి !

Telugu Lo Computer
0


మరో మహమ్మారిని ఎదుర్కొనేందకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అన్నారు. కోవిడ్ కంటే ప్రాంతకమైన వేరియంట్ పుట్టుకొచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. కోవిడ్‌ హెల్త్ ఎమర్జెన్సీ ముగింపుతో ఆరోగ్య సంక్షోభం ముగిసిపోలేదన్నారు. కోవిడ్‌కు చెందిన ఏదో ఒక కొత్త వేరియంట్ కొత్త వ్యాధులను సృష్టిస్తుందని, మరణాలు కూడా సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. మరో మహమ్మారి తలుపు తడితే మనం నిర్ణయాత్మకంగా, సమిష్టిగా, సమానంగా సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని టెడ్రోస్ సూచించారు. 6వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా డబ్ల్యూహెచ్‌వో చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2017 ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ సమయంలో నిర్దేశించిన మూడు బిలియన్ లక్ష్యాన్ని కూడా మహమ్మారి ప్రభావితం చేసిందన్నారు. కరోనా కేసులు ప్రపంచవ్యాప్తంగా కొంత తగ్గుముఖం పట్టిన సమయంలో డబ్ల్యూహెచ్వో అధ్యక్షుడు ఇటువంటి హెచ్చరికలు చేయడం గమనార్హం.

Post a Comment

0Comments

Post a Comment (0)