హైదరాబాద్ కు ఒక రూపం తీసుకువచ్చింది చంద్రబాబే ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 9 May 2023

హైదరాబాద్ కు ఒక రూపం తీసుకువచ్చింది చంద్రబాబే !


ఈ ఏడాది ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఎన్ని వివాదాలకు దారితీశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వేడుకలకు సూపర్ స్టార్ రజినీకాంత్ రావడం, ఆయన ఎన్టీఆర్ తో పాటు చంద్రబాబును పొగడడం జరిగాయి. హైదరాబాద్ ఇంత మారడానికి చంద్రబాబు అని, ఆయన విజన్ పెద్దది అని రజినీకాంత్ చెప్పుకొచ్చారు. ఇక ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడ్డ విషయం కూడా తెల్సిందే. సూపర్ స్టార్ రజినీకాంత్ అనవసరంగా ఆంధ్రాకు వచ్చి అవమానపడ్డాడు అని నెటిజన్లు చెప్పుకొచ్చారు. ఇక అంతేకాకుండా తమిళ తంబీలు.. రజినీకి సారీ చెప్పాలని డిమాండ్ కూడా చేశారు. ఇక ప్రస్తుతం ఇప్పుడిప్పుడే ఈ వివాదం సద్దుమణుగుతుంది. అయితే ఎక్కడో ఒక చోట ఈ వివాదంపై చర్చ జరుగుతూనే ఉంది. మొన్నటికి మొన్న జగపతి బాబు మాట్లాడుతూ.. ” రజినీకాంత్ ఏది చెప్పినా నిజమే చెప్తాడు.. నిజమే మాట్లాడతాడు” అని చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు నటుడు సుమన్ సైతం రజినీకాంత్ మాట్లాడిన దాంట్లో తప్పేం లేదని చెప్పుకొచ్చాడు. ఒక ప్రైవేట్ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన  ఈ వివాదంపై స్పందించారు. ” నాకు తెలిసినంతవరకు రజినీకాంత్ ఇచ్చిన స్పీచ్ లో ఎక్కడ తప్పు చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పారు. అవును, ఆ సమయంలో కొన్ని మిస్టేక్స్ జరిగాయి.. కానీ, ఈరోజు ఉన్న హైదరాబాద్ కు ఒక రూపం తీసుకువచ్చింది చంద్రబాబు నాయుడు గారే. మెయిన్ ఆర్కిటెక్చర్ ఆయనే. తరువాత గవర్నమెంట్ మారింది.. వేరే ప్రభుత్వం టేకోవర్ చేసింది. అయితే ఇప్పుడు శంషాబాద్ ఉండొచ్చు, ఐటీ సెక్టార్ ఉండొచ్చు. ఈరోజు ఇంతమందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి అంటే అది ఆయనవలనే. టైమ్ మారింది.. పాలిటిక్స్ లో ఒకరు వస్తారు, ఇంకొకరు పోతారు.. ఎత్తుపల్లాలు ఉంటాయి. చెప్పాలంటే.. ఆయన మంచి సీఎం కూడా.. టైం బ్యాడ్ అంతే.. చేంజ్ ఓవర్ ప్రజలు కోరుతుంటారు.. అంతేకానీ, ఆయన చేసింది చేయలేదు అని చెప్పలేం” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

1 comment: