కారుతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన డ్రైవర్ !

Telugu Lo Computer
0


ఢిల్లీలో చేతన్ అనే వ్యక్తి డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఓ ప్రయాణికుడిని ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో డ్రాప్ చేసి తిరిగి వెళ్తున్నాడు. మార్గంమధ్యలో స్థానికంగా ఉన్న ఆశ్రమ్ చౌక్ దగ్గరకు రాగానే చేతన్ కారును రాంచంద్ కుమార్ అనే వ్యక్తి మద్య మత్తులో మూడు సార్లు ఢీకొట్టాడు. దీంతో చేతన్ కారు దిగి వ్యక్తిని ప్రశ్నించబోయాడు. అయితే అవేమీ పట్టించుకోని రాంచంద్ కుమార్, చేతన్ కారును వేగంగా తనపైకి పోనిచ్చినట్లు ఆరోపించారు. దీంతో తాను కారు బానెట్ పై ఉండిపోయినట్లు తెలిపాడు. తనను అలాగే మూడు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడని, అటువైపుగా వెళ్తున్న పోలీసులు గమనించి కారును వెంబడించారని బాధితుడు వెల్లడించారు. కారు ఆపమని ఎంత చెప్పినా వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఈ ఘటనపై నిందితుడు చేతన్ మాట్లాడుతూ తాను అసలు రాంచంద్ కుమారును ఢీకొట్ట లేదని చెప్పారు. అతను ఉద్దేశపూర్వకంగానే తన కారు బానెట్ పైకెక్కి, తనను కారులోంచి దిగమని నానా హంగామా చేశాడని ఆరోపించాడు. కారు బానెట్ పైనుంచి కిందికి దిగమని అతనికి చాలా సార్లు చెప్పానని కానీ, అతను వినలేదని చేతన్ తెలిపాడు. ఈ ఘటనకు కారణమైన కారు బీహార్ ఎంపీ చందన్ సింగ్ కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. అయితే, ఘటన జరిగిన సమయంలో మాత్రం ఎంపీ కారులో లేరని, ర్యాష్ డ్రైవింగ్ కింద చేతన్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)