అపాచీ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ !

Telugu Lo Computer
0


ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి  చెందిన అపాచీ హెలికాప్టర్‌ ఈరోజు  మధ్యప్రదేశ్‌లోని బిండ్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. చాపరల్‌లో ఏదో సాంకేతిక సమస్య వచ్చినట్లు పైలెట్ గుర్తించాడని అధికారులు తెలిపారు. ఆ వెంటనే హెలికాప్టర్‌ను ల్యాండ్ చేసినట్లు వెల్లడించారు. అయితే పైలెట్ అప్రమత్తంగా ఉండడం వల్ల హెలికాప్టర్‌ను సురక్షితంగా దించామని, భారీ ప్రమాదాన్ని తప్పించామని అధికారులు తెలిపారు. ఏహెచ్‌-64 అపాచీ హెలికాప్టర్‌ ప్రపంచంలో అత్యంత ఆధునిక హెలికాప్టర్‌. మల్టీరోల్ ఆపరేషన్స్‌లో దీన్ని వాడుతారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వద్ద 22 అపాచీ హెలికాప్టర్లు ఉన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)