టీడీపీ మేనిఫెస్టోపై మాజీ సీఎస్ ఐవైఆర్ క్రిష్టారావు ట్వీట్ !

Telugu Lo Computer
0


తెలుగు దేశం అధినేత చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టో ఇప్పుడు రాజకీయ చర్చగా మారింది. ఈ మేనిఫెస్టోలోని అంశాల పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను టీడీపీ అడ్డుకుంటోందని వైసీపీ ప్రచారం చేస్తోంది. దీంతో ఎన్నికలకు ముందుగానే ప్రజల్లోకి తాము సంక్షేమ అందిస్తామనే ప్రచారం తీసుకెళ్లే వ్యూహంలో భాగంగా మహానాడు వేదికగా చంద్రబాబు తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసారు. మహిళకు సంబంధించి పలు హామీలు ఇచ్చారు. యువతకు ఉపాధి కల్పనపైన మరో హామీ ప్రకటించారు. బీసీల ఓటింగ్ ను తిరిగి ఓన్ చేసుకొనే క్రమంలో కొత్త చట్టం తీసుకొస్తామని చంద్రబాబు ప్రకటించారు. చంద్రబాబు మేనిఫెస్టో పై మాజీ సీఎస్ ఐవైఆర్ క్రిష్టారావు ట్వీట్ చేసారు. చంద్రబాబు మేనిఫెస్టో ప్రకటనపైన పత్రికల్లో వచ్చిన కధనం కు తన కామెంట్స్ జత చేసారు. అందులో పోటీ ప్రజాకర్షణ పథకాలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు గ్రహణాలు. ఎంత త్వరగా సుప్రీంకోర్టు ఈ అంశాన్ని తేల్చి మేనిఫెస్టో అమలుకు ప్రతి రాజకీయ పార్టీ ఆదాయం ఏ విధంగా చేకూర్చుకుంటుందో ప్రజలకు తెలియజేయాలనే నిబంధన ఏర్పాటు చేయకపోతే అన్ని రాష్ట్రాలలో ఇది ఒక ప్రధాన సమస్య అవుతుందని పేర్కొన్నారు. గతంలో అమరావతి విషయంలోనూ ఐవైఆర్ పలు సందర్భాల్లో ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఐవైఆర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)