కర్నూలుకు సీబీఐ టీమ్ !

Telugu Lo Computer
0


మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ టీమ్ ఉదయాన్నే కర్నూలు వెళ్లింది. ఎస్పీని కలిసి చాలాసేపు చర్చించింది. ఆ తర్వాత కర్నూలులో ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి ట్రీట్‌మెంట్ పొందుతున్న విశ్వభారతి ఆస్పత్రి దగ్గర సెక్యూరిటీని పెంచింది. ప్రస్తుతం అవినాష్ రెడ్డి  ఆ ఆస్పత్రిలోనే ఉన్నారు. తన తల్లికి ఆరోగ్యం బాలేదనీ  ట్రీట్‌మెంట్ జరుగుతోందని నిన్న సీబీఐకి లేఖ రాశారు ఆయన. సీబీఐ కోరినట్లుగా ఇవాళ  తాను హాజరుకాలేననీ తనకు ఓ పది రోజులు గడువు కావాలని ఆయన కోరారు. అందువల్ల ఇవాళ సీబీఐ ఏం చెయ్యబోతోందనేది ఆసక్తిగా మారింది. వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు అవినాష్ రెడ్డి. ఇదివరకు ఆయన నాలుగు సందర్భాల్లో విచారణను వాయిదా వేశారు. కొన్నిసార్లు విచారణకు హాజరయ్యారు. కానీ.. తాజాగా వరుసగా రెండుసార్లు ఆయన విచారణకు రాలేదు. మూడోసారీ లేఖ పంపి.. ఏకంగా 10 రోజుల గడువు కోరడంతో... సీబీఐ అధికారులు తెల్లారే కర్నూలు వెళ్లారు. వారు ఇవాళ అవినాష్ రెడ్డిని కలిసి డైరెక్టుగా నోటీస్ ఇస్తారా లేక అదుపులోకి తీసుకుంటారా.. లేక.. కర్నూలులోనే విచారణ జరుపుతారా అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం విశ్వభారతి ఆస్పత్రి ముందు కొత్త ఏసీ అంబులెన్స్ ఉంది. అది అవినాష్ రెడ్డి తల్లికోసమే తెప్పించి ఉంటారని తెలుస్తోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)