'ది కేరళ స్టోరీ' డైరెక్టర్, హీరోయిన్ కు రోడ్డు ప్రమాదం - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 14 May 2023

'ది కేరళ స్టోరీ' డైరెక్టర్, హీరోయిన్ కు రోడ్డు ప్రమాదం


ది కేరళ స్టోరి డైరెక్టర్ సుదీధీప్తో సేన్, హీరోయిన్ ఆదా శర్మ ముంబైలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్తుండగా వీరికి యాక్సిడెంట్‌ జరిగింది. ప్రమాదంలో గాయపడిన డైరెక్టర్ సుదీప్తో సేన్, ఆదా శర్మను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే కరీంనగర్‌లో సాయంత్రం జరిగే హిందూ ఏక్తాయాత్రకు కేరళ స్టోరీ టీమ్ హాజరుకావాల్సి ఉండగా, ప్రమాదం జరగడంతో తాము రాలేకపోతున్నట్లు డైరెక్టర్ సుధీప్తో సేన్ ట్వీట్ చేశారు. ఆదా శర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నాని ప్రధాన పాత్రలో నటించిన ఈసినిమాను కేరళలో తప్పిపోయిన 32 వేల మంది యువతలు ఏమయ్యారు, ఎక్కడున్నారనే ఇతివృత్తంతో తెరకెక్కించారు. ఇందులో కేరళలో తప్పిపోయిన నలుగురు అమ్మాయిలు ఉగ్రసంస్థ ఐఎస్ఐలో చేరి శిక్షణ పొంది పొంది తమ మాతృభూమిపైనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టిన్నట్లు చూపించడంతో వివాదాలకు దారి తీసింది. ఈ సినిమాను కేరళ ప్రభుత్వం, కాంగ్రెస్‌తో సహా పలువిపక్షాలు భారీ ఎత్తున వ్యతిరేకిస్తున్నాయి. ఈ చిత్రంలో కేరళ రాష్ట్రాన్ని, అప్పటి ప్రభుత్వాన్ని కించపరిచేలా రూపొందించారని మండిపడుతున్నాయి. 

No comments:

Post a Comment