ఏర్పాట్లు సరిగ్గా లేవని అలిగిన వెళ్లిన పెళ్లి కొడుకు !

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్‌ ప్రయోగరాజ్‌లో పెళ్లి ఏర్పాట్లు సరిగా చేయలేదన్న కారణంతో ఓ పెండ్లి కొడుకు పెళ్లి పీటల మీద నుంచి లేచి వెళ్లిపోయాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా నిలిచింది. ప్రయోగరాజ్‌ జిల్లాలోని హలియాకు చెందిన యువకుడికి బరహులాకు చెందిన యువతితో పెళ్లి కుదిరింది. ముందుగా అనుకున్నట్లుగానే వధువు తరుఫు వారు పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. వరుడి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కల్యాణ మండపానికి చేరుకున్నారు. మండపంలో వివాహతంతు మొదైలంది. అయితే ఆర్కెస్ట్రా అనుకున్న సమయానికి స్టార్ట్ కాకపోవడంతో పెండ్లి కొడుకుకు కోపం వచ్చింది. అంతేకాదు అతను చెప్పిన విధంగా లైటింగ్, డెకరేషన్ చేయలేదని అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. లైటింగ్, ఆర్కెస్ట్రా విషయంలో పెండ్లి కూతురు తరఫు వారితో గొడవకు దిగాడు. వారు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వినకుండా పెళ్లి పీటల మీద నుంచి లేచి బయటకు వెళ్లిపోయాడు. వరుడి తరఫు వారు సైతం అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకుండా ఇంటికి వెళ్లిపోయాడు. దీంతో వధువు సోదరుడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాడు. పెండ్లికొడుకు కోరినవన్నీ ఇచ్చేందుకు పొలాలను తనఖా పెట్టామని అయినా పెళ్లి మధ్యలో వెళ్లిపోయాడని ఫిర్యాదులో చేశాడు. పోలీసుల రాకతో వరుడి తండ్రి తన కొడుకును పెళ్లికి ఒప్పిస్తానని హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది.

Post a Comment

0Comments

Post a Comment (0)