తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నిరసనలు

Telugu Lo Computer
0


భజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని కర్ణాటక కాంగ్రెస్‌ తన మేనిఫెస్టోలో పెట్టడంతో దానికి నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నిరసన చేపట్టింది. దీనిలో భాగంగా నిజామాబాద్‌ బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రికత్త చోటు చేసుకుంది. కాంగ్రెస్‌ కార్యాలయానికి బీజేపీ నేతలు ర్యాలీగా బయల్దేరగా, వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు బీజేపీ నేతలకు తోపులాట చోటు చేసుకుని పరిస్థితి ఉద్రిక్తతలకు దారి తీసింది. రోడ్డుపైనే బీజేపీ శ్రేణులు బైఠాయించి హనుమాల్‌ చాలీసాను చదివారు. ఇక ఖమ్మంలో కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది హైదరాబాద్‌లో కూడా గాంధీ భవన్‌ను ముట్టడించాలని పిలుపునిచ్చింది. బీజేపీ పిలుపు మేరకు గాంధీభవన్‌ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌-భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు పోటాపోటీ నిరసనలు చేశారు. గాంధీభవన్‌లోకి చొచ్చుకెళ్లారు. ఈ నేపథ్యంలో భజరంగ్‌దళ్‌ కార్యకర్తలకు-పోలీసులకు తోపులాట జరిగింది. గాంధీభవన్‌ ఎదుట హనుమాన్‌ చాలీసా చదివారు భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు.

Post a Comment

0Comments

Post a Comment (0)