యూనివర్శిటీ గేమ్స్ లోగో, మస్కట్ ఆవిష్కరించిన యోగీ !

Telugu Lo Computer
0


ఉత్తర ప్రదేశ్ లో ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్ ను మూడోసారి నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్ధులను అంతర్జాతీయ క్రీడలకు అనుగుణంగా సానబెట్టేందుకు వీలుగా యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ ఈ గేమ్స్ నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన లోగో, మస్కట్ లను సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఇవాళ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా పాల్గొన్నారు. ఈ నెల 23 నుంచి జూన్ 3 వరకూ యూపీలో ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్ మూడో ఎడిషన్ జరగబోతోంది. ఇందులో రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీల క్రీడాకారులు పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే భారీ ఎత్తున ఖర్చుపెడుతున్న ప్రభుత్వం.. వీటి ఏర్పాట్లను కూడా ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసింది. ఈ నేపథ్యంలోనే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ రోజు లక్నోలో ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ లోగో, మస్కట్, గీతాన్ని ఆవిష్కరించారు. ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్ మూడో ఎడిషన్ లో భాగంగా ఇవాళ ప్రారంభమయ్యే టార్చ్ రిలే బుందేల్ ఖండ్ లోని నాలుగు ప్రాంతాల మీదుగా సాగనుంది. ఇది మే 25న లక్నోకు తిరిగి రానుంది. మే 23న క్రీడల ఓపెనింగ్ సెరిమనీ ఉంటుందని, అదే రోజు కబడ్డీ వంటి క్రీడలు కూడా ఉంటాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి ఈ గేమ్స్ గత ఏడాదే జరగాల్సి ఉండగా, కరోనా కారణంగా వాయిదా పడ్డాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)