సినిమా థియేటర్‌లో ఎలుక కొరికినందుకు యాజమాన్యం చెల్లించాల్సిందే ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 5 May 2023

సినిమా థియేటర్‌లో ఎలుక కొరికినందుకు యాజమాన్యం చెల్లించాల్సిందే !


సినిమాకు వెళితే థియేటర్ లో ఓ మహిళని ఎలుక కొరికింది. ఏంటా కొరికినట్లుగా చురుక్కుమంది కాలికి రక్తం కారుతోంది ఏంటాని చూస్తే అక్కడే ఎలుకలు హడావిడిగా తిరటం గుర్తించింది. అంతే ఇన్ని డబ్బులు పెట్టుకుని వస్తే ఈ ఎలుక కొరుకుడు బాదేంటిరా బాబూ అనుకుంటు థియేటర్ యాజమాన్యానికి విషయం చెప్పింది. థియేటర్ మెయింటేన్ చేసేది అంటూ ప్రశ్నించింది. అది విన్న యాజమాన్యం పెద్దగా పట్టించుకోలేదు ఇలాంటివి కామనే అన్నట్లుగా వ్యవహరించింది. దీంతో ఆమె ఆగ్రహంగా మరోసారి ప్రశ్నించింది. దానికి వారు లైట్ తీస్కోండి, కొరికింది ఎలుకే కదా అన్నారు. దీంతో ఆమె కోపం నషాళానికి అంటింది. మీ నిర్లక్ష్యానికి సమాధానం లీగల్ గానే తేల్చుకుంటానంటూ వార్నింగ్ ఇచ్చి బయటకు వచ్చేసిందామె. వెంటనే కన్జ్యూమర్ ఫోరమ్‌ కు వెళ్లింది. అక్కడ కూడా నిర్లక్ష్యమే. ఫిర్యాదు చేయటానికి వెళితే తీసుకోలేదు. అలా ఆమె ఏమాత్రం నిరాశ చెందలేదు. ఫిర్యాదు చేయటానికి పదే పదే కన్య్జూమర్ ఫోరమ్ చుట్టూ ఐదు నెలలు తిరిగింది. కానీ వారు ఫిర్యాదు తీసుకోలేదు. అలా పట్టువదలని విక్రమార్కురాలిగా ఎట్టకేలకు ఆ ఫిర్యాదును ఫోరమ్ స్వీకరించింది. కోర్టుకు ప్రొడ్యూస్ చేసింది. ఇదంతా 2018లో జరిగింది. అంటే నాలుగేళ్లు దాటింది. అక్టోబర్ 28న అస్సాం గువాహటి లోని గలేరియా మాల్‌లో జరిగిందీ ఘటనపై ఇన్నేళ్లకు కోర్టు తీర్పునిచ్చింది. థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంవల్లే ఈ ప్రమాదం జరిగిందని, థియేటర్‌ని నీట్ గా ఉంచటం యాజమాన్యం కనీస బాధ్యత అని, నిర్లక్ష్యానికి పరిహారం చెల్లించాల్సిందేని తేల్చిచెప్పింది. వెంటనే పరిహారంగా రూ.67,000 ఫైన్ కట్టాలని ఆదేశించింది. 45 రోజుల్లోగా ఆ మహిళకు పరిహారం చెల్లించాలని, ఒకవేళ 45 రోజుల్లోగా చెల్లించకపోతే వడ్డీతో సహా ముక్కు పిండి వసూలు చేస్తాం అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. వడ్డీ అంటే 12% వడ్డీ రేటు చొప్పున కలెక్ట్ చేయాల్సి ఉంటుంది అంటూ వార్నింగ్ ఇచ్చింది. నాలుగేళ్ల క్రితం ఘటనకు చెందిన ఈ వార్త వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా కన్య్జూమర్ కోర్టు వ్యాఖ్యానిస్తూ థియేటర్ శుభ్రంగా ఉండేలా చూసుకోవడం యాజమాన్యం కనీస బాధ్యత అని సూచించింది. బాధితురాలు చేసిన ఫిర్యాదు ప్రకారం చూస్తే సినిమా హాల్ అపరిశుభ్రంగా ఉంది. నిర్లక్ష్యంతో పాప్‌కార్న్ వంటి ఆహారపదార్ధాలు పారేసి ఉన్నాయి. వాటిని క్లీన్ చేయకుండానే షోలు వేస్తున్నారు. ఆహార వ్యర్ధాలు తినేందుకు వచ్చిన ఎలుకల వల్ల ఇటువంటి ఇబ్బందులు వస్తాయి. అలా వచ్చి ఓ మహిళ కాలుని కొరికాయి. ఆ బాధితురాలు చాలా రోజుల పాటు ఆ గాయంతో బాధ పడ్డారు. ఇది కచ్చితంగా నిర్లక్ష్యమేననితేల్చి చెప్పింది. ఇకనైనా ఇటువంటి నిర్లక్ష్యం వహించకుండా థియేటర్లు నడపాలని సూచించింది.

No comments:

Post a Comment