బస్సులో రాహుల్ రాకతో మహిళల భావోద్వేగం ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 8 May 2023

బస్సులో రాహుల్ రాకతో మహిళల భావోద్వేగం !


కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఘట్టానికి తెరపడింది. చివరి రోజు ప్రచారంలో కాంగ్రెస్ జోరు చూపించింది. రాహుల్ గాంధీ బస్సులో ప్రచారం చేస్తూ మహిళలతో మాట్లాడారు. సడన్ గా బెంగళూరు మెట్రోపాలిటన్ బస్సులో రాహుల్ కనపడే సరికి మహిళలు భావోద్వేగానికి లోనయ్యారు. ఆయనను కొంతమంది ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. బస్సు ప్రయాణంలో రాహుల్ గాంధీ.. మహిళలు, కళాశాల విద్యార్థినులతో ముచ్చటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారితో ఆప్యాయంగా మాట్లాడారు. నిత్యావసరాల ధరల పెరుగుదల ప్రభావాన్ని ఓ మహిళ రాహుల్ దృష్టికి తీసుకెళ్లింది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వల్ల జరుగుతున్న నష్టాలను ఏకరువు పెట్టింది. కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గృహలక్ష‍్మి పథకం ద్వారా మహిళలకు ప్రతినెల రూ.2000 ఇస్తామనే హామీని రాహుల్‌ గాంధీ మరోసారి బస్సులో గుర్తు చేశారు. మహిళలకు బీఎంటీసీ, కేఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని కూడా చెప్పారు. ప్రచారం చివరి రోజున రాహుల్ తీరిక లేకుండా గడిపారు. కాంగ్రెస్ నిర్వహించిన పలు ర్యాలీలకు హాజరయ్యారు.


No comments:

Post a Comment