శరత్ చంద్రారెడ్డికి పూర్తి స్థాయి బెయిల్

Telugu Lo Computer
0


ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డికి ఊరట లభించింది. ఇటీవల మధ్యంత బెయిల్ పై ఉన్న ఆయనకు ఢిల్లీ హైకోర్టు ఆయనకు పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేసింది. తీహార్ జైలులో ఉన్న శరత్ చంద్రారెడ్డి తన భార్య అనారోగ్య కారణాల పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేయాలన్న కోర్టుకు విన్నవించుకున్నారు. దీంతో కోర్టు సానుకూలంగా స్పందిస్తూ పూర్తిస్థాయి బెయిల్ మంజూరు చేసింది. తన భార్య అనారోగ్యం దృష్ట్యా ఆమెను చూసుకోవాలని, దాని కోసం 6 వారాలు బెయిల్‌ మంజూరు చేయాలని పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్‌పాల్‌ దీనిపై విచారణ చేపట్టారు. నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌ మంజూరు చేశారు. తాజాగా శరత్‌చంద్రారెడ్డికి పూర్తి స్థాయి బెయిల్‌ మంజూరు చేసింది. రూ.2 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో పూర్తిస్థాయి బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా ధర్మాసనం శరత్‌ చంద్రారెడ్డికి పలు షరతులు విధించింది. భార్య చికిత్స కోసం మినహా హైదరాబాద్‌ దాటి వెళ్లకూడదని, ఎట్టి పరిస్థితుల్లోనూ దేశం విడిచి వెళ్లకూడదని ఆదేశించింది. మొబైల్‌ ఫోన్‌ ఎప్పుడూ దగ్గర ఉంచుకోవాలని, అందులో లొకేషన్‌ ఆన్‌లో పెట్టాలని సూచించింది. సాక్షులను బెదిరించకూడదని హెచ్చరించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)