పిన్న వయస్సులోనే ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసిన అధరా పెరెజ్ !

Telugu Lo Computer
0


మెక్సికో కు చెందిన అధరా పెరెజ్ సాంచెజ్ అనే బాలిక రెండేళ్ల క్రితం ఐక్యూ పరీక్షలో 162 మార్కులు సాధించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఆమె స్కోర్ గొప్ప శాస్త్రవేత్తలైన ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్ కంటే రెండు పాయింట్లు ఎక్కువ. అధరా తన పదునైన మేధా శక్తితో ప్రపంచంలోనే అత్యంత తెలివైన మేధావులను వెనక్కి నెట్టివేసింది. సాధారణంగా ఐక్యూ స్కోర్ అనేది మన ఆలోచనా సామర్థ్యాన్ని, అర్థం చేసుకునే స్థాయిని తెలియజేస్తుంది. మన మనస్సు ఒక పనిని ఎంత చక్కగా చేస్తుంది, సమస్యకు ఎంత త్వరగా, సమర్ధవంతంగా పరిష్కారాన్ని కనుగొనగలం అన్న విషయాలకు రేటింగ్ ఇచ్చేది ఐక్యూ. పేద కుటుంబంలో పెరిగిన అధరా వేగంగా ఎదగలేకపోయింది. ఆటిస్టిక్‌గా ఉండటంతో, ఆమెను తరచుగా పాఠశాలలో బెదిరింపులకు, వేధింపులకు గురయ్యేది. ఆమె తోటివారు పలు పేర్లతో పిలిచి ఆటపట్టించేవారు. దీంతో ఆమె పాఠశాలకు వెళ్లడమే మానేసింది. ఉపాధ్యాయులు కూడా అంతగా పట్టించుకోలేదు. ఈ కారణంగా ఆమె మూడుసార్లు పాఠశాలను మార్చవలసి వచ్చింది. తల్లి నయేలీ సాంచెజ్ మాట్లాడుతూ, అధరా బాధపడటం ప్రారంభించిందని, ఆ బాధతో ఏమీ తినేది కాదని, టీచర్ల ప్రవర్తన సరిగా లేకపోవడంతో స్కూల్‌కి వెళ్లాలని అస్సలు అనిపించకపోయేదని చెప్పింది. కానీ కొద్ది రోజుల్లోనే ఆమె ప్రతిభ బయటపడిందని తెలిపింది. అధరా కేవలం 3 సంవత్సరాల వయస్సులోనే 100 పజిల్స్‌ను పరిష్కరించేదని తల్లి నయేలీ సాంచెజ్ చెప్పారు. ఆమెకు పూర్తి ఆవర్తన పట్టిక గుర్తుకు ఉండేదని, చాలా మంది అత్యంత కఠినమైనదిగా భావించే ఆల్జీబ్రాపైనా పట్టు సాధించిందని తెలిపింది. అధరా 8 సంవత్సరాల వయస్సులో ఉన్నత పాఠశాలలో ఉత్తీర్ణత సాధించింది. చాలా చిన్న వయస్సులోనే ఆమె సిస్టమ్స్ ఇంజనీరింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ చేసింది. మార్స్‌పై అడుగుపెట్టాలన్నది ఆమె కల. అంతే కాదు ఆమె అమెరికన్ స్పేస్ ఏజెన్సీలో చేరాలని కూడా కలలు కంటోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)