వేలంలో అనూహ్య ధర పలికిన టిప్పు సుల్తాన్ కత్తి !

Telugu Lo Computer
0


లండన్ లో నిర్వహించిన వేలంలో 18వ శాతాబ్దపు మైసూర్ రాజ్య పాలకుడు టిప్పు సుల్తాన్ కత్తికి అనూహ్య ధర పలికింది. ఏకంగా 14 మిలియన్ పౌండ్లు అంటే దాదాపుగా రూ.140 కోట్ల రూపాయలయు అమ్ముడైంది. అనుకున్న ధర కన్నా దాదాపుగా ఏడు రెట్లకు అమ్ముడైనట్లు వేలం వేసిన సంస్థ బోన్ హామ్స్ తెలిపింది. 18వ శతాబ్ధంలో జరిగిన వివిధ యుద్ధాల్లో ఈ కత్తికి ప్రాధాన్యం ఉందని తెలిపింది. మరాఠాలకు, బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా టిప్పు అనేక యుద్ధాల్లో పాల్గొన్నాడు. 16వ శతాబ్ధంలో భారతదేశానికి తీసుకువచ్చిన జర్మన్ బ్లేడ్ డిజైన్ ను ఉపయోగించి మొఘలుల కాలంలో దీన్ని తయారు చేశారనే వాదన ఉంది. టిప్పు సుల్తాన్ రాజభవనంలోని ప్రైవేట్ క్వార్టర్‌లో కత్తి దొరికింది. కత్తి వేలంలో ఇద్దరు ఫోన్ బిడ్డర్లు, ఓ బిడ్డర్ మధ్య హాట్ హాట్ గా వేలం పాట జరిగింది. టిప్పు సుల్తాన్ ఖడ్గం 14 మిలియన్ పౌండ్లకు అమ్ముడుపోవడంపై ఇస్లామిక్ అండ్ ఇండియన్ ఆర్ట్ గ్రూప్ మెడ్ నిమా సాగర్చి ఆనందం వ్యక్తం చేశారు. టిప్పు సుల్తాన్‌ను చంపిన తర్వాత, అతని ఖడ్గాన్ని బ్రిటీష్ మేజర్ జనరల్ డేవిడ్ బైర్డ్‌కు అతని ధైర్యానికి చిహ్నంగా సమర్పించినట్లు వేలం సంస్థ తెలిపింది. ఈ కత్తిపై భగవంతుడి ఐదు గుణాలు, కత్తిపై 'పాలకుడి కత్తి' అని రాసి ఉంటుంది. కత్తిపై రత్నాలు పొదిగి ఉన్నాయి. పిడి వద్ద పులితల బొమ్మ ఉంటుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)