మణిపూర్ రాష్ట్రానికి వెళ్లనున్న అమిత్ షా !

Telugu Lo Computer
0


హింసతో అట్టుడుకుతున్న మణిపూర్ రాష్ట్రానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెళ్లనున్నారు. మణిపూర్ లో శాంతి నెలకొనాలని అమిత్ షా గురువారం విజ్ఞప్తి చేశారు, త్వరలో ఈశాన్య రాష్ట్రాన్ని సందర్శించి హింసలో పాల్గొన్న రెండు వర్గాల ప్రజలతో మాట్లాడతానని చెప్పారు.'' కోర్టు తీర్పు తర్వాత మణిపూర్ లో ఘర్షణలు జరిగాయి. నేను శాంతియుతంగా ఉండాలని రెండు వర్గాలకు విజ్ఞప్తి చేస్తాను. అందరికీ న్యాయం జరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత నేనే మణిపూర్ వెళ్లి అక్కడే మూడు రోజులు ఉంటాను. శాంతి స్థాపన కోసం మణిపూర్ ప్రజలతో మాట్లాడుతాను'' అని గౌహతిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన అన్నారు. మే 3న ప్రారంభమైన నిరసనలు నెమ్మనెమ్మదిగా ఇరు వర్గాల మధ్య హింసాత్మక సంఘటనలకు దారి తీశాయి. మణిపూర్ లో మెజారిటీ మెయిటీ కమ్యూనిటీకి గిరిజన హోదాను కల్పించే విషయాన్ని వ్యతిరేకిస్తూ కూకీ, నాగా గిరిజనులు నిర్వహించిన ' గిరిజన సంఘీభావ ర్యాలీ'లో హింసాత్మక సంఘటనలు జరిగాయి. దీంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ.. ఇళ్లు తగలబెట్టుకున్నారు. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు 70 మంది మరణించారు. వేల సంఖ్యలో ఇళ్లు దగ్ధమయ్యాయి. వందల సంఖ్యలో వాహనాలకు నిప్పు పెట్టారు. సైన్యం, పారామిలిటరీ, మణిపూర్ పోలీసులు ప్రస్తుతం పరిస్థితిని చక్కదిద్దారు. ఇదిలా ఉంటే బుధవారం జరిగిన ఘర్షణల్లో ఒకరు మరణించడం మరోసారి హింసాత్మక సంఘటనలకు దారి తీసింది. ఈ ప్రాంతాల్లో బలగాలను మోహరించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)