నేరేడుపండ్లు - శని దోష నివారణ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 18 May 2023

నేరేడుపండ్లు - శని దోష నివారణ !


నేరేడు పండ్లు తింటే కడుపులో ఉండే మలినాలు శుభ్రం కావడమే కాకుండా, దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కలిగే అనారోగ్య సమస్యల నుండి కాస్త బయటపడవచ్చు. నేరేడు పండ్లు మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాకుండా వ్యాధి తీవ్రతను తగ్గిస్తాయి. మూత్ర సంబంధమైన వ్యాధుల నుండి కూడా ఉపశమనాన్ని కలిగిస్తాయి.  నేరేడు పండును శని దేవుడికి ప్రియమైన నల్లనువ్వులతో కలిపి దానం చేస్తే జీవితంలో శని బాధలు తొలగిపోతాయి . దేవుడి పేరుతో పూజించిన నేరేడు పండ్లను బిచ్చగాళ్ళకు దానం చేస్తే కూడా దరిద్రం దరిచేరదని చెబుతుంటారు. అంతేకాదు నేరేడు పండును పుణ్యక్షేత్రాల్లో బ్రాహ్మణులకు తాంబూల సమేతంగా దానం చేస్తే భూదానం చేసినంత ఫలితం వస్తుందని చెబుతున్నారు. ప్రతిరోజు మనం నేరేడు పండును రోజుకొకటి చొప్పున తింటే రోగాల నుండి బయట పడే అవకాశం ఉంటుంది. ఎవరికైనా భోజనం పెట్టేటప్పుడు భోజనంతోపాటు నేరేడు పండ్లను కూడా వడ్డిస్తే మీకు ఎప్పటికీ భోజనం లభిస్తుందని చెబుతారు. శని దేవుడి దుష్ప్రభావాలు జీవితం పైన ఉండకుండా ఉండాలంటే నువ్వుల నూనెతో కాని ఆముదం తో కానీ శని దేవుడ్ని పూజించాలి. పడమర దిక్కున ఇనుప గరిటెలో దీపాన్ని పెట్టి నేరేడు పండు నైవేద్యంగా పెడితే మంచి ఫలితం ఉంటుందని చెబుతారు. 

No comments:

Post a Comment