వేదిక మీద వరుణ్ని చూసి పెళ్లికి నిరాకరించిన వధువు !

Telugu Lo Computer
0


బీహార్‌ రాష్ట్రం బాగల్‌పుర్‌లోని కహల్‌గావ్‌ ప్రాంతంలో వరుడు నల్లగా ఉన్నాడని, వయసులో తనకంటే చాలా పెద్దవాడిలా కనిపిస్తున్నాడని చెప్పి వధువు కిట్టూ కుమారి నిరాకరించింది.కాసేపట్లో మూడుముళ్లు పడతాయనగా ఈ పెళ్లి చేసుకోనంటూ మొండికేసింది. ఊరేగింపుగా వచ్చిన వరుడు వివాహ వేదికపైకి వచ్చాక, అతణ్ని చూడగానే యువతి ముఖం ఒక్కసారిగా మారిపోయింది. వరుడి మెడలో దండ వేసి, తిలకం పెట్టేందుకు ససేమిరా అంది. వరుడి కుటుంబసభ్యులు ఆమెను పెళ్లికి ఒప్పించేందుకు పలు హామీలు ఇచ్చారు. వెనక్కి తగ్గని వధువు మరింత మొండిగా ప్రవర్తించింది. చివరకు వివాహాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది.

Post a Comment

0Comments

Post a Comment (0)