ఆస్ట్రేలియా చేరుకున్న మోడీ

Telugu Lo Computer
0


విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఆస్ట్రేలియాకి చేరుకున్నారు. సిడ్నీవిమానాశ్రయంలో ఆస్ట్రేలియా హైకమిషనర్ బారీ ఓ ఫారెల్ ప్రధాని మోడీకి ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రవాస భారతీయులు ప్రధానికి స్వాగతం పలికారు. "భారత్ మాతా కీ జై" "వందేమాతరం" అని నినాదాలు చేశారు. ప్రధాని కోసం వచ్చిన ఓ వృద్ధ మహిళ ''సునో సునో ఏ దునియా వాలో భారత్‌కో బులాయా హై'' అనే పాటపాడి వినిపించగా ప్రధాని మోడీ ఓపిగ్గా విన్నారు. ప్రధానిని కలిసేందుకు వచ్చిన ప్రవాస భారతీయుల పిల్లల బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మోదీ వారితో మమేకమై ముచ్చటించారు. వారికి ఆశీస్సులు అందించారు. ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనిస్తోతో ప్రధాని మోడీ ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ఇరుదేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారం ఒప్పందంలో భాగంగా ట్రేడింగ్ వృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలు, ఇరుదేశాల ప్రజల మధ్య సత్సంబంధాల బలోపేతం, పునరుత్పాదక ఇంధనం, రక్షణ, భద్రత సహకారం సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. ఈ మేరకు ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారిక ప్రటకన విడుదల చేసింది. ఆస్ట్రేలియాలో పెరుగుతున్న వాణిజ్యం, వృద్ధిని నడపడానికి ప్రధాని మోడీ ఆస్ట్రేలియా వ్యాపారవేత్తలను కూడా కలవనున్నారు. భారతదేశంతో పెట్టుబడులు, ఆస్ట్రేలియా-భారత్ నుంచి అవకాశాలను వారితో చర్చించనున్నారు. మరోవైపు ఆస్ట్రేలియాలోని భారతీయ ప్రవాసుల కమ్యూనిటీ ఉత్సవాల్లో ఇరు దేశాల ప్రధానులు పాల్గొననున్నారు. ఇదిలా ఉండగా సెప్టెంబర్‌లో భారత్‌లో పర్యటించేందుకు తాను ఎదురుచూస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ తెలిపారు. ఢిల్లీలో జరిగే జి-20 సమ్మిట్‌లో పాల్గొననున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)