మామిడి పండ్లు - ఆరోగ్య సమస్యలు !

Telugu Lo Computer
0


మామిడి పండ్లు చాలా ప్రీతికరమైన ఆహారం. వీటిలో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. తక్షణ శక్తినిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కానీ కొంతమందికి  మామిడిపండ్ల తినడం వలన ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొంతమందికి మామిడిని తిన్నప్పుడు అలర్జీ వస్తుంది. చర్మంపై దురద, పొక్కులు, దద్దుర్ల వంటివి వస్తాయి. ఊపిరి పీల్చడం కష్టమవుతుంది. వారు మామిడికీ, మామిడి చెట్లకూ దూరంగా ఉండాలి. కొంతమందికి పొల్లెన్ అలర్జీ ఉంటుంది. అంటే.. వారు ఏదైనా తిన్నప్పుడు నోట్లో దురద, పొక్కులు, గొంతు నొప్పి, పెదవులకు సమస్యలు వస్తాయి. ఈ పొల్లెన్ అలర్జీ ఉన్నవారు మామిడి తినేముందు నిపుణుల సలహా తీసుకోవాలి. మామిడిలో పిండి పదార్థం రూపంలో సహజ చక్కెర ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు మామిడిని తింటే షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరుగుతాయి. అందువల్ల వారు కొద్ది మొత్తంలో తినవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎంత తినాలి, ఏ టైమ్‌లో తినాలి అనే అంశంపై నిపుణుల సలహా తీసుకోవాలి. కొంతమందికి కడుపులో సమస్యలు ఉంటాయి. వారికి ఏది తిన్నా గ్యాస్ పుడుతుంది. మరికొందరికి ఇర్రిటబుల్ బొవెల్ సిండ్రోమ్ సమస్య ఉంటుంది. వారు తీపి పదార్థాలు తింటే  కడుపులో తేడా వస్తుంది. పొట్ట ఉబ్బుతుంది, గ్యాస్ వస్తుంది, విరేచనాలు అవుతాయి. అలాంటి వారు మామిడి తినే ముందు నిపుణుల సలహా తీసుకోవాలి. మామిడిలో ఫ్యురానోకోమారిన్స్ వంటి పదార్థాలు ఉంటాయి. లివర్ సమస్యలు ఉన్నవారికి ఈ పదార్థాలు సమస్య అవుతాయి. రకరకాల మందులు వాడేవారు, ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నవారు మామిడి తినవచ్చో, లేదో కచ్చితంగా అడిగి తెలుసుకోవాలి. లేదంటే  చాలా ఇబ్బంది పడతారు. మామిడిని ఒకేసారి మరీ ఎక్కువగా తినకూడదు. జ్యూస్ చేసుకొని తాగొచ్చుగానీ.. అందులో షుగర్ వేసుకోవడం మంచిది కాదు. 

Post a Comment

0Comments

Post a Comment (0)