కునో నేషనల్ పార్క్ లో చిరుత పిల్ల మృతి

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్క్ లో చిరుత పులి పిల్ల మృతి చెందింది. జ్వాల అనే ఆడ చిరుత పిల్లలో ఒకటి అందులో ఒకటి అనారోగ్యంతో మంగళవారం మృతి చెందింది. జ్వాల మార్చి 24న నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే, మృతికి కారణాలు మాత్రం తెలియలేదని, అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే కునోలో మూడు చిరుతలు మృతి చెందిన విషయం తెలిసిందే. సాషా, దక్ష ఆడ చిరుతలతో పాటు ఉదయ్ అనే మగ చిరుతల ఇటీవల మరణించాయి. తాజాగా మరో పులి పిల్ల చనిపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతుండగా అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. కునో మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్ తీరు, సమర్థతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జంతువుల కన్సర్వేషన్ ప్రాజెక్టులో లోపాలు సైతం ఉండవచ్చని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కునోలో 17 చిరుతలు, మూడు పిల్లలు మిగిలాయి. సుమారు 75 సంవత్సరాల ట్రాన్స్లోకేషన్ ప్రాజెక్ట్ చీతాలో భాగంగా నమీబియాతో పాటు దక్షిణాఫ్రికా నుంచి మొత్తం 20 చిరుతలను భారత్కు తరలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)