కబాబ్ లు బాగోలేవని కుక్ ను కాల్చి చంపారు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 4 May 2023

కబాబ్ లు బాగోలేవని కుక్ ను కాల్చి చంపారు !


ఉత్తర ప్రదేశ్ లోని బరేలీ, ప్రేమ్ నగర్ ప్రాంతంలోని ప్రియదర్శిని నగర్‌లో ఉన్న ఓ పాత కబాబ్ దుకాణానికి ఇద్దరు వ్యక్తులు విలాసవంతమైన కారులో వచ్చారు. అప్పటికే వారు ఫుల్ గా తాగి ఉన్నారు. కబాబులు రుచిగా లేవని, తమకు నచ్చడం లేదని దుకాణ యజమాని అంకుర్ సబర్వాల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలోనే వారి మధ్య వాగ్వాదం పెరిగింది. ఇద్దరు అంకుర్ సబర్వాల్‌పై దాడి చేసి, డబ్బులు ఇవ్వకుండా తమ కారు వద్దకు వెళ్లారు. దీంతో అంకుర్ సబర్వాల్ వారి నుండి రూ.120 వసూలు చేసుకుని రమ్మని నసీర్ అహ్మద్‌ ను పంపించాడు. దగ్గరకి వస్తున్న నసీర్ ను వారిలో ఒకరు తుపాకీతో కాల్చాడు. దీంతో అతను స్పాట్లోనే చనిపోయాడు. ఆ తరువాత ఇద్దరు వ్యక్తులు అక్కడినుంచి పరారయ్యారు. కాగా, ఈ దాడి జరుగుతున్న సమయంలో కొంతమంది వారు వచ్చిన కారు ఫొటోలు తీశారు. ఈ ఫొటోల ఆధారంగా కారు ఉత్తరాఖండ్‌లోని కాశీపూర్‌ కు చెందినదిగా పోలీసులు తెలిపారు. “కారు రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఉపయోగించి హంతకులను గుర్తించాం. పోలీసులు గుర్తు తెలియని దుండగులపై హత్య కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపారు” అని పోలీసు సూపరింటెండెంట్ రాహుల్ భాటి తెలిపారు.

No comments:

Post a Comment