వచ్చే సంవత్సరం నుంచి నంది అవార్డులు !

Telugu Lo Computer
0


తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ నంది అవార్డులపై స్పందించారు. ఎవరు పడితే వాళ్లు అడిగితే పురస్కారాలు ఇవ్వరని మంత్రి తేల్చి చెప్పారు. అయినా సినీ ఇండస్ట్రీ నుంచి తమకు ఎవరూ ప్రతిపాదన కూడా  పంపలేదని మంత్రి గుర్తు చేశారు. వచ్చే సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున నంది అవార్డులు ఇస్తామని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయాక నంది అవార్డులకు ప్రాధాన్యత తగ్గిపోయిందని ఆదిశేషగిరిరావు అన్నారు. నంది అవార్డులపై రెండు తెలుగు ప్రభుత్వాలకు ఆసక్తి లేదన్నారు. తన ఉద్దేశంలో అసలు అవార్డులకు ప్రాధాన్యత లేదని ఆయన పేర్కొన్నారు. నంది అవార్డుల కంటే సంతోషం అవార్డులు ఘనంగా నిర్వహిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉత్తమ రౌడీ, ఉత్తమ గూండా అవార్డులు ఇస్తున్నారని ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ కీలక వ్యాఖ్యలు చేశారు.రెండు మూడేళ్లలో తిరిగి ప్రభుత్వాలు అవార్డులు ఇవ్వటం మొదలవుతుందని చెప్పుకొచ్చారు. ఒకప్పుడు తెలుగు చిత్రసీమలో నంది అవార్డుల కార్యక్రమం అంటే ఓ పండుగలా జరిగేది. నంది అవార్డు గ్రహీతలకు ఎంతో గుర్తింపు, గౌరవం లభించేవి. కానీ రాష్ట్ర విభజన జరిగాక నంది అవార్డుల వ్యవహారం నిరాదరణకు గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అశ్వినీ దత్ వ్యాఖ్యలపై నటుడు, ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి ఖండించిన విషయం తెలిసిందే. ఉత్తమ రౌడీ, ఉత్తమ గూండా అని కాదు.. మీరు ఉత్తమ వెన్నుపోటుదారుడు, ఉత్తమ లోఫర్, ఉత్తమ మోసగాడు.. అని అవార్డులు ఇవ్వాలని వ్యాఖ్యానించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)