మేము ఎప్పటికీ స్నేహితులమే ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 9 May 2023

మేము ఎప్పటికీ స్నేహితులమే !


సంతోష్ శోభన్ హీరోగా, మాళవిక నాయర్ హీరోయన్ గా జోడీ కట్టిన తాజా చిత్రం 'అన్నీ మంచి శకునములే'. స్వప్న సినిమాస్ బ్యానర్ పై అశ్వినీదత్ కుమార్తెలు స్వప్న దత్, ప్రియాంక దత్ కలిసి నిర్మించిన ఈ సినిమాకు లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. నిర్మాతలు అశ్వినీ దత్, అల్లు అరవింద్, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు స్నేహానికి 30 ఏళ్లు నిండిన సందర్భంగా 'అన్నీ మంచి శకునములే' మూవీ టీమ్ బంతి భోజనం పేరుతో డిఫరెంట్ గా ప్రమోషన్స్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో స్వప్న దత్, ప్రియాంక దత్ చివరిగా నిర్మించిన సీతా రామం సినిమాపై ప్రశంసించిన రాఘవేంద్ర రావు తనకు ఒకే బాధ ఉందన్నారు. "సీతా రామం సినిమాలో సీత పాత్ర ఏమైంది. ఆమె జీవితాన్ని సర్వనాశనం చేయడం బాధగా ఉంది. నేను ఒక ఐడియా చెబుతాను. మీ డైరెక్టర్ కు చెప్పు. ఆమెను బాధపడనిచ్చి తెలియకుండా రివాల్వర్ తీసుకెళ్లి విలన్ దగ్గరకెళ్లి కాల్చబోతే, వాడు గుహలోంచి ఎక్కడికెక్కడో తీసుకెళ్లిపోయి రామ్ చావలేదని చెప్తాడు. అప్పుడు వాళ్లిద్దరు తప్పించుకుంటే ఫ్యామిలీ విలన్స్ ఎలా ఛేజ్ చేస్తారనే కోణంలో స్టోరీ చేయండి" అని రాఘవేంద్ర రావు హింట్ ఇచ్చారు. రాఘవేంద్ర రావు చెప్పిన సీతా రామం సీక్వెల్ స్టోరీకి స్వప్న స్పందించారు. "మీరు జగదేక వీరుడు సీక్వెల్ గురించి ఆలోచించండి" అని స్వప్న చెప్పుకొచ్చారు. దీంతో ప్రియాంకను పిలిచిన రాఘవేంద్ర రావు.. మీ ఆయన నాగ్ అశ్విన్ తో ఆ సినిమా తెరెకెక్కించమని సూచించారు. "నీకు ఓ సీక్రెట్ చెప్తా. అశ్వినీ దత్ కు, అరవింద్ కు నాలాంటి డైరెక్టర్ల అవసరం లేదు. ఎందుకంటే దత్, అల్లున్ని ఇంట్లో కట్టేసి పెట్టుకున్నాడు. అరవింద్ ఏమో హీరోను ఇంట్లో కట్టేసి పెట్టుకున్నాడు. వీళ్లిద్దరికి నాతో పని తీరిపోయింది. అయినా మేము ఎప్పటికీ స్నేహితులమే" అని రాఘవేంద్ర రావు సర్‌ప్రైజింగ్ కామెంట్స్ చేశారు.

No comments:

Post a Comment