ఐదు హామీలను నెరవేరుస్తాం !

Telugu Lo Computer
0


కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే న్యూఢిల్లీలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, పార్టీ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఐదు హామీలను ప్రభుత్వం ఏర్పాటైన తరువాత అమలు చేస్తామని చెప్పారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో స్థానిక అంశాలను ప్రధానంపై దృష్టిసారించిన కాంగ్రెస్ పార్టీ ఆ అంశాలను మేనిఫెస్టోలోనూ పొందుపరిచింది. ప్రధానంగా ఐదు హామీలు ఇచ్చింది. ''గృహ జ్యోతి, గృహ లక్ష్మి, అన్న భాగ్య, యువనిధి, శక్తి'' అనే ఐదు గ్యారంటీలు ఇచ్చింది. పార్టీ అధికారంలోకి అధికారంలోకి వచ్చిన తక్షణమే వాటిని అమలు చేస్తామని వాగ్దానం చేసింది. కర్ణాటక ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని తిప్పికొట్టి, కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకువచ్చారని, రికార్డు స్థాయిలో ఓట్లు వేశారని ఖర్గే చెప్పారు. తదుపరి సీఎం ఎవరనే ప్రశ్నకు స్పందిస్తూ, ఆదివారం సీఎల్‌పీ సమావేశం పూర్తికాగానే ఆ రిపోర్టును అధిష్ఠానానికి అందజేస్తామని, అధిష్ఠానం తగిన సమయం తీసుకుని సీఎం పేరును అధికారికంగా ప్రకటిస్తుందని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)