విజయవంతమైన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ పరీక్ష ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 14 May 2023

విజయవంతమైన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ పరీక్ష !


భారత నావికాదళం ఫ్రంట్‌లైన్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ఐఎన్‌ఎస్ మోర్ముగావ్ నుంచి బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి నిర్దిష్ట లక్షాన్ని ఛేదించిందని నేవీ అధికారులు తెలిపారు. దీనిలోని ఆయుధాలు, స్వదేశీవేనని, ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా తయారు చేసినవని పేర్కొంది. గతేడాది డిసెంబర్ 18న రక్షణ మంత్రి సమక్షంలో డిస్ట్రాయర్లను జల ప్రవేశం చేయించారు. అందులో రెండోది ఐఎన్‌ఎస్ మోర్ముగావ్ . భారత నావికాదళం లోని వార్‌షిప్ డిజైన్ బ్యూరోలో డిజైన్ రూపొందించగా, మజగావ్ డాక్‌షిప్‌లో తయారు చేశారు. గోవాలోని మోర్ముగావ్ నౌకాశ్రయం పేరును ఈ మిసైల్ డిస్ట్రాయర్‌కు పెట్టారు. 15 బి స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ల ప్రాజెక్టులో ఐఎన్‌ఎస్ మోర్ముగావ్ రెండోది కాగా, ఇందులో అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు ఉన్నాయి. ఉపరితలం నుండి ఉపరితలానికి , ఉపరితలం నుంచి గగనానికి క్షిపణులను ప్రయోగించే వీలుంటుంది. ఆధునిక రాడార్‌ను కూడా ఇందులో ఏర్పాటు చేశారు. జలాంతర్గాములపై దాడి చేయగల సత్తా దీనికి ఉంది.

No comments:

Post a Comment