ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరొకరు అరెస్టు

Telugu Lo Computer
0


ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో మరో అరెస్టు జరిగింది. న్యూస్ ఛానల్ ఉద్యోగి అరవింద్ సింగ్‌ను సీబీఐ అదుపులోకి తీసుకుంది. అరవింద్ సింగ్‌ రూ.17 కోట్ల నగదు లావాదేవీలు జరిపినట్లు గుర్తించింది. కొన్ని గంటల పాటు ప్రశ్నించిన అనంతరం అరెస్టు చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసింది సీబీఐ. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సహా మరికొంత మంది ప్రముఖులు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొెంటున్నారు. ఈ కేసుకు సంబంధించి బీఆర్‌ఎస్‌ ఎమెల్సీ కల్వకుంట్ల కవితను కూడా ఈడీ రెండు రోజులపాటు విచారించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)