భజ్‌రంగ్ దళ్‌ 'గూండాల గ్రూపు' - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 15 May 2023

భజ్‌రంగ్ దళ్‌ 'గూండాల గ్రూపు'


మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో సోమవారంనాడు  కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ  హిందుత్వం అనేది ధర్మం కాదని, ఆ పేరుతో దాడులకు పాల్పడటాన్ని తాము అంగీకరించమని అన్నారు. సామరస్యం, అందరి సంక్షేమం కోరుకునే సనాతన ధర్మాన్ని తాను నమ్ముతానని తెలిపారు. విశ్వహిందూ పరిషత్ యువజన విభాగమైన భజ్‌రంగ్ దళ్‌ను 'గూండాల గ్రూపు'గా అభివర్ణించారు. ''మనది సనాతన ధర్మం. హిందుత్వను ఒక ధర్మంగా మనం పరిగణించం. ధరమ్ కీ జై హో, అధర్మ్ కా నాష్ హో, ప్రాణియోం మే సద్భావన్ హో, విశ్వ కా కల్యాణ్ హో అనేవి సనాతన ధర్మ నినాదాలు. అదే సనాతన ధర్మం'' అని ఒక ప్రశ్నకు సమాధానంగా దిగ్విజయ్ సింగ్ చెప్పారు. అయితే, హిందుత్వ విషయంలో అలా కాదని, హిందుత్వ అంటే... తమతో ఏకీభవించని వారిని కర్రలతో కొట్టడం, ఇళ్లు కూల్చవేయడమని ఆరోపించారు. భజరంగ్ దళ్‌ను భజరంగ్‌ బలి (హనుమంతుడు)తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోల్చడం బాధాకరమని దిగ్విజయ్ అన్నారు. ఇది హనుమాన్‌ను అవమానించడమేనని, ఇందుకు క్షమాపణలు కోరుకోవాలన్నారు. తాను చెప్పిన గూండాల గుంపు జబల్‌పూర్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయాన్ని మే 4న ధ్వంసం చేసిందని ఆయన ఆరోపించారు. రాజ్యాంగం, నిబంధనలు, చట్టాలను కాంగ్రెస్ గౌరవిస్తుందని, ఆ ప్రకారం నడుచుకుంటుందని చెప్పారు. కర్ణాటకలో బజ్‌రంగ్ దళ్‌పై నిషేధం విధిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీపై ప్రశ్నించగా, విద్వేష ప్రకటనలు చేసేవారిపై మతప్రసక్తి లేకుండా కేసులు రిజిస్టర్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిందని, తాము దానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. 

No comments:

Post a Comment