యువతులతో నగ్నంగా పూజలు ? - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 14 May 2023

యువతులతో నగ్నంగా పూజలు ?


ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తాడికొండ మండలం  పొన్నెకల్లు గ్రామంలో పూజల ద్వారా డబ్బు వస్తుందని ముగ్గురు అమ్మాయిలతో నగ్న పూజలు చేయించిన ఘటన వెలుగుచూసింది. నగ్న పూజలతో పాటు ముగ్గురు అమ్మాయిలపై ఓ నకిలీ పూజారి రోజుల తరబడి అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో చిలకలూరిపేటకు చెందిన ఓ మహిళ ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నకిలీ పూజారితో విజయవాడ, గుంటూరు, పొన్నెకల్లు, ఒంగోలులోని లాడ్జిల్లో ఈ యువతులు పూజలు చేసినట్లు సమాచారం. ఇలా గతకొన్ని రోజులుగా పూజల పేరుతో ఈ అమ్మాయిలపై అత్యాచారం చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది. చిలకలూరిపేటకు చెందిన మహిళకు సోషల్ మీడియాలో.. పొన్నెకల్లుకు చెందిన నకిలీ పూజారి పరిచయం అయ్యాడు. తరువాత కర్నూలు జిల్లా ఆత్మకూరు ప్రాంతానికి చెందిన ముగ్గురు అమ్మాయిలు అనతి కాలంలోనే అధికంగా డబ్బును సంపాదించాలనే ఆశతో సదరు మహిళను సంప్రదించారు. దీంతో ఆ మహిళ నకిలీ పూజారిని రంగంలోకి దించింది. లాడ్జిల్లో అమ్మాయిలను నగ్నంగా కూర్చోపెట్టి పూజలు చేశారు. అదే విధంగా పొన్నేకల్లులోని కొన్ని రహస్య ప్రదేశాలలో పూజలు చేశారు. పూజలు చేసిన అనంతరం అమ్మాయిలను నకిలీ పూజారి శారీరకంగా అనుభవించాడని యువతులు పోలీసులకు తెలిపారు. పూజల మధ్యలో లేస్తే వచ్చే లక్షల రూపాయలు రాకుండా పోతాయని ఆ ముగ్గురు అమ్మాయిలను నకిలీ పూజారితో పాటు మహిళ నిలువునా మోసం చేశారు. నకిలీ పూజారి, సదరు మహిళ తీరుపై అనుమానం వచ్చి వారు మోసపోయామని గ్రహించిన అమ్మాయిలు  దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వ్యవహరం బెడిసి కొట్టడంతో.. ఆ ముగ్గురు అమ్మాయిలను ఓ ప్రదేశంలో విడిచిపెట్టి, నకిలీ పూజారి పరారయ్యాడు. వచ్చే డబ్బులోవాటా కోసం మరో ముగ్గురు యువకులు సైతం ఇందులో పాల్గొన్నట్లు సమాచారం. అసలు ఇందులో ఆ ముగ్గురు యువకుల పాత్ర ఏంటీ, ముగ్గురు అమ్మాయిలకు ప్రధాన సూత్రధారి అయిన మహిళ ఎలా పరిచయం అయింది అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దీంట్లో ఇంకా ఎవరెవరు ఉన్నారు. ఇంతకు ముందు ఇలాంటివి ఏమైనా చేశారా అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. బాధిత అమ్మాయిలను పోలీసు స్టేషన్​కు తరలించి పోలీసులు రక్షణ కల్పించారు. పోలీసులు వెంటనే స్పందించడంపై అమ్మాయిలు కృతజ్ఞతలు తెలిపారు. 

No comments:

Post a Comment