ఐఆర్సీటీసీ షిరిడీ, నాసిక్ టూర్ ప్యాకేజీ

Telugu Lo Computer
0


షిరిడీ, నాసిక్ సందర్శన మూడు రోజుల్లో పూర్తయ్యేలా ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ సాయి శివమ్ పేరుతో ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఈ యాత్ర 3 రాత్రులు, 4 పగళ్లు కొనసాగనుంది. తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో ఆధ్యాత్మిక యాత్ర చేయాలనుకుంటున్నవారికి ఇది అనుకూలంగా ఉంటుంది. జూన్ 2వ తేదీన మరో ట్రిప్ బయలుదేరనుంది సికింద్రాబాద్ స్టేషన్ లో ప్రతి శుక్రవారం రైలు ప్రారంభమవుతుంది. నిజామాబాద్, కామారెడ్డి స్టేషన్లలో స్టాప్ ఉంది. యాత్రకు వెళ్లేవారు ఈ రెండు స్టేషన్లలో కూడా రైలు ఎక్కొచ్చు. కంఫర్ట్, స్టాండర్డ్ పేరుతో రెండు ప్యాకేజ్ లు అందుబాటులో ఉన్నాయి. కంఫర్ట్ ఎంచుకుంటే థర్డ్ ఏసీలో, స్టాండర్డ్ అయితే స్లీపర్ లో ప్రయాణం ఉంటుంది. శుక్రవారం సాయంత్రం 6.50 గంటలకు 17064 రైలు (అజంతా ఎక్స్‌ప్రెస్‌) ప్రారంభమై రెండోరోజు శనివారం ఉదయం 7.10 గంటలకు నాగర్ సోల్ చేరుకుంటుంది. ఆరోజుకు షిరిడీలోనే బస ఉంటుంది. భక్తులు కావాలనుకుంటే శని సింగనాపూర్ దర్శించుకొని రావచ్చు. మూడో రోజు షిరిడీ నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాసిక్‌కు ప్రయాణం ఉంటుంది. త్రయంబకేశ్వరంలోని జ్యోతిర్లింగ ఆలయ దర్శనం తర్వాత పంచవటి దర్శనం ఉంటుంది. సాయంత్రానికి తిరిగి నాగర్‌సోల్‌ స్టేషన్‌కు చేరుకుంటారు. రాత్రి 9.20 గంటలకు 17063 (అజంతా) రైలును అందుకుంటారు. తర్వాతరోజు ఉదయం 8.50 గంటలకు రైలు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. సింగిల్‌ షేరింగ్‌ (కంఫర్ట్‌) - ₹13,420, సింగిల్‌ షేరింగ్‌ (స్డాండర్డ్‌) - ₹11,730, ట్విన్‌షేరింగ్‌ (కంఫర్ట్‌) - ₹8,230, ట్విన్‌ షేరింగ్‌ (స్డాండర్డ్‌) - ₹6,550గా నిర్ణయించారు. అలాగే ట్రిపుల్‌ షేరింగ్‌ (కంఫర్ట్‌) - ₹6,590, ట్రిపుల్‌ షేరింగ్‌ (స్టాండర్డ్‌) - ₹4,910, చైల్డ్‌ విత్‌ బెడ్‌ (5-11 ఏళ్లు) (కంఫర్ట్‌) - ₹5,440, చైల్డ్‌ విత్‌ బెడ్‌ (5-11 ఏళ్లు) (స్టాండర్డ్‌) - ₹3,760, చైల్డ్‌ వితౌట్‌ బెడ్‌ (5-11 ఏళ్లు) (కంఫర్ట్‌)- ₹5,380, చైల్డ్‌ వితౌట్‌ బెడ్‌ (5-11 ఏళ్లు) (స్టాండర్డ్‌)- ₹3690గా ఉంటుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్, ట్రావెల్ ఇన్సూరెన్స్, లోకల్ గా జర్నీ ఐఆర్సీటీసీ కల్పిస్తుంది. మిగతావన్నీ ప్రయాణికులే భరించాలి. 

Post a Comment

0Comments

Post a Comment (0)