బస్సునే బడిగా మార్చారు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 18 May 2023

బస్సునే బడిగా మార్చారు !


గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ ప్రాంతానికి చెందిన విద్యాకుంజ్-విద్యాఫిఠ్ అనే సంస్థ విద్యకు దూరంగా ఎక్కడో మురికి వాడలో, పుట్ పాత్ లపై నివసించే పేద చిన్నారులకు విద్యను అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ విద్యార్థుల కోసం బస్సునే బడిగా మార్చి వారి వద్దకే తీసుకెళ్లింది. ఆ బస్సులోనే బెంచీలు, టీవీ, ఇంటర్ నెట్, ఫ్యాన్, లైట్లు వంటి అత్యాధునిక వసతులు ఉన్నాయి. అంతేకాకకుండా విద్యార్థులకు తరగతి అనే అనుభూతి వచ్చేలా బస్సును తీర్చిదిద్దారు. పేద పిల్లలు ఉండే ప్రాంతానికే రోజూ ఆ సంస్థ ప్రతినిధులు బస్సులో వెళ్తుంటారు. పిల్లలను బస్సులోకి జాగ్రత్తగా తీసుకొచ్చి, వినోదాత్మకంగా పాఠాలు బోధిస్తున్నారు. మురికివాడల్లో, పుట్ పాత్ పై ఉండే పేద పిల్లలకు విద్య అవసరమని, అది అందించడమే తమ ఆశయమని ఆ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. చదువుతోనే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం బస్సులో 32 మంది విద్యార్థులే ఉన్నారని, ఒకవేళ ఈ సంఖ్య పెరిగితే మాత్రం మూడు గంటల చొప్పున రెండు బ్యాచ్ లుగా ఏర్పాటు చేసి తరగతులు నిర్వహించనున్నట్లు వివరించారు.

No comments:

Post a Comment