పంచాయతీ కార్యదర్శి హఠాన్మరణం !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలి మండలం జగ్గడిగుంటపాలెం పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న అబ్బూరి మారుతీ వర ప్రసాద్‌ మృతి చెందారు. ఆయన రెండో కుమార్తె టెన్త్‌ పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాడు. భార్య, కుమార్తె కృష్ణాజిల్లాలోని బంధువుల ఇంటికి వెళ్లడంతో కొల్లూరు పంచాయతీ కార్యాలయంలో సహచరుల వద్ద కొంతసేపు గడిపేందుకు వెళ్లారు. అక్కడ గంటపాటు గడిపిన అనంతరం ఫలితాలు వెలువడే సమయం కావడంతో కారులో ఇంటికి తిరిగి వెళ్లారు. కారులో ప్రయాణిస్తున్న సమయంలోనే కృష్ణాజిల్లాలో ఉన్న భార్యతో ఫోన్‌లో మాట్లాడారు. తనకు కొంచెం నీరసంగా ఉందని, పరీక్ష ఫలితాలు తెలుసుకున్న అనంతరం విధులకు వెళతానని తెలిపారు. కొల్లూరు గాయత్రీ నగర్‌లోని ఇంటికి చేరుకున్న ఆయన కారును ఇంటిలో నిలిపి ఇంజన్‌ ఆపకుండానే లోపలకు వెళ్లి సోఫాలో కూలబడిపోయాడు. ఆరోగ్యం సరిగా లేదని భర్త తెలపడంతో ఆందోళనకు గురైన భార్య కోమలి ఫోన్‌ చేసినా సమాధానం లేకపోవడంతో కంగారు పడి పక్కింటి మహిళకు ఫోన్‌ చేసి ఇంట్లో చూడాలని కోరింది. ఇంటికి వచ్చిన ఆమె సోఫాలో కూర్చుని ఉన్న ప్రసాద్‌ను పిలిచినా సమాధానం లేకపోవడంతో దగ్గరకు వెళ్లి పలుమార్లు తట్టి లేపేందుకు ప్రయత్నించినప్పటికీ ఉలుకు, పలుకు లేకపోవడంతో అతని భార్యకు ఫోన్‌ చేసి పరిస్థితి వివరించింది. కొల్లూరులో ఉండే బంధువులకు మృతుడు భార్య ఫోన్‌ చేయడంతో వెంటనే వైద్యుని తీసుకువెళ్లి పరీక్షలు చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యుడు నిర్ధారించారు. పంచాయతీ కార్యదర్శి ప్రసాద్‌ మృతదేహం వద్ద భార్య, కుమార్తె, బంధువుల రోదనలతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భౌతికకాయాన్ని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ సందర్శించి నివాళులర్పించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)