పెరుగుతున్నధరలు - తగ్గుతున్న డిమాండ్​

Telugu Lo Computer
0


బంగారం ధరలు పెరుగుతుండడంతో  గిరాకీ తగ్గుతోంది. ఈ ఏడాది జనవరి-మార్చి క్వార్టర్​లో మనదేశంలో దీనికి డిమాండ్​ 17 శాతం తగ్గి 112.5 టన్నులకు పడిపోయిందని వరల్డ్​ గోల్డ్​ కౌన్సిల్​(డబ్ల్యూజీసీ) ప్రకటించింది. అయితే పోయిన సంవత్సరంలో మార్చి క్వార్టర్​ డిమాండ్​ 135.5 టన్నులని తెలిపింది. ఈ ఏడాది బంగారం ధరలు విపరీతంగా పెరగడం వల్లే డిమాండ్​ తక్కువగా ఉంది. మార్చి క్వార్టర్​లో పండుగలు కూడా తక్కువగా ఉండటం వల్ల గిరాకీ మందకొడిగా ఉందని డబ్ల్యూజీసీ రీజనల్ సీఈఓ పీఆర్​ సోమసుందరం చెప్పారు. అమెరికాలో వడ్డీరేట్లు పెరగడంతో డాలర్​ విలువలో మార్పుతో రూపాయి తగ్గిందన్నారు. దీంతో బంగారం ధర రూ.60 వేల స్థాయికి వెళ్లిందని, గత ఏడాదితో పోలిస్తే ధరలు 19 శాతం పెరిగాయని వివరించారు. అందుకే చాలా మంది పాత బంగారాన్ని కరిగించి కొత్తవి చేయించుకున్నారని, కొంతమంది మాత్రం తక్కువ మొత్తంలో బంగారం కొన్నారని పేర్కొన్నారాయన. ​ విలువ పరంగా చూస్తే ఈ క్వార్టర్​లో ఇది వార్షికంగా తొమ్మిది శాతం తగ్గి రూ.61,540 కోట్ల నుంచి రూ.56,220 కోట్లకు చేరుకుంది. 2023 మొదటి క్వార్టర్​లో మొత్తం ఆభరణాల డిమాండ్ 17 శాతం తగ్గి 78 టన్నులుగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో 94.2 టన్నులుగా ఉంది. నగల డిమాండ్ విలువ 2022 మొదటి క్వార్టర్​తో పోలిస్తే 9 శాతం తగ్గి రూ.42,800 కోట్లకు చేరింది. బంగారు కడ్డీలు, నాణేల కొనుగోళ్లు కూడా 2023 మొదటి క్వార్టర్​లో 41.3 టన్నుల నుండి 17 శాతం తగ్గి 34.4 టన్నులకు పడిపోయాయి. ఆర్​బీఐ రేట్లు తగ్గినప్పటికీ 2023లో బంగారం డిమాండ్‌ పెరగలేదని, రాబోయే క్వార్టర్​లో వర్షాల వల్ల డిమాండ్​ తగ్గే అవకాశం ఉందని చెప్పారు. 2023లో బంగారానికి డిమాండ్​ 750--800 టన్నులు ఉంటుందని భావిస్తున్నామని సోమసుందరం వివరించారు. 2023 మొదటి క్వార్టర్​లో మొత్తం ఇన్వెస్ట్​మెంట్​ డిమాండ్ 17 శాతం తగ్గి 34.4 టన్నులకు చేరిందని, గత ఏడాది ఇదే కాలంలో 41.3 టన్నులుగా ఉందని డబ్ల్యూసీజీ రిపోర్ట్​ పేర్కొంది. విలువ పరంగా చూస్తే, 2022 జనవరి--మార్చి మధ్యకాలంలో రూ. 18,750 కోట్ల నుండి రూ.17,200 కోట్లకు పడింది. రీసైకిల్డ్​ మొత్తం బంగారం ఇదేకాలంలో 25 శాతం పెరిగి 34.8 టన్నులకు చేరుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)