ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియను చేపడతాం !

Telugu Lo Computer
0


పాఠశాల విద్యలో త్వరలో ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియను చేపడతామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఉపాధ్యాయులపై బోధనేతర పనుల భారాన్ని తగ్గిస్తామని స్పష్టం చేసారు. టీచర్ల సమయం పూర్తిగా బోధనకే కేటాయించేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నిర్వహించిన మంత్రి బొత్సా పలు కీలక నిర్ణయాలు వెల్లడించారు. కాగా, టీచర్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన 117 జీవో రద్దుచేయాలని ఉపాధ్యాయ సంఘాలు మంత్రిని కోరాయి. బదిలీలు, పదోన్నతులపై ప్రభుత్వ ఆలోచనను ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులకు వివరించామని, వీటిపై సమగ్రంగా చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. బదిలీలపై ఉపాధ్యాయ సంఘాలు కొన్ని సలహాలు చెప్పాయని, అదే విధంగా జివో ఉపసంహరణపై కొన్ని మార్పులు, చేర్పులు చేయాలని కోరాయని తెలిపారు. వీటిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని, వారం, పదిరోజుల్లో ఇందుకు సంబంధించిన ప్రక్రియను మొదలుపెడతామని చెప్పారు. 117 జివో వల్ల ఇబ్బంది పడ్డ ఉపాధ్యాయులకు పాత పాయింట్లు ఇవ్వాలని సంఘాలు కోరితే దానికి అంగీకరించామని చెప్పారు. ఉపాధ్యాయులపై బోధనేతర పనుల భారాన్ని తగ్గిస్తామని మంత్రి బొత్స హామీ ఇచ్చారు. యాప్‌ల సంఖ్య అలాగే ఉంటుందని, వాటిద్వారా చేయాల్సిన పని తగ్గుతుందని చెప్పారు. టాయిలెట్లు, మధ్యాహ్న భోజనం లాంటి పనులను పది శాతం చేస్తే సరిపోతుందన్నారు. టీచర్ల సమయం పూర్తిగా బోధనకే కేటాయించేలా చూస్తామన్నారు. ఇప్పటివరకూ జగనన్న విద్యాకానుక కిట్లు మండల కేంద్రం నుంచి ఇచ్చామని, ఈసారి నేరుగా పాఠశాలలకే పంపుతామని తెలిపారు. సచివాలయ విద్య వాలంటీర్‌కు కొన్ని బాధ్యతలు అప్పగిస్తామన్నారు. 117 జీవో ద్వారా ప్రభావితమైన టీచర్లకు పాత పాఠశాల పాయింట్లను బదిలీల్లో కలుపుతామని చెప్పారు. బదిలీలు ఎలా జరగాలన్నది పూర్తిగా టీచర్లకే అప్పగించామని చెప్పారు. ఉపాధ్యాయ సంఘాలు మార్గదర్శకాలు రాసిస్తే దానినే జీవో రూపంలో విడుదల చేస్తామని ప్రకటించారు. ఐఎఎస్‌ అధికారులందరూ ప్రతి నెలా కనీసం రెండు పాఠశాలలు సందర్శించాలని చెప్పారు. హైస్కూల్‌ ప్లస్‌, కెజిబివిలలో ఇంటర్‌ పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం తగ్గడానికి కారణాలను విశ్లేషించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరంలో ఉత్తీర్ణత శాతం పెరిగేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలో అధికారులను కోరామన్నారు. బదిలీలు ఎలా జరగాలన్నది పూర్తిగా టీచర్లకే అప్పగించామని, ఉపాధ్యాయ సంఘాలు మార్గదర్శకాలు రాసిస్తే దానినే జీవో రూపంలో విడుదల చేస్తామని మంత్రి బొత్సా ప్రకటన చేసారు.

Post a Comment

0Comments

Post a Comment (0)