జగదీష్ శెట్టర్ కు కొత్త బాధ్యతలు ?

Telugu Lo Computer
0


కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ సీఎం జగదీష్ శెట్టర్ తరువాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బీజేపీ వెన్నుపోటు పొడించిందని ఆరోపించి కాంగ్రెస్ పార్టీలో చేరి హుబ్బళి-ధారవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన మాజీ సీఎం జగదీష్ శెట్టర్ ఓడిపోయారు. మాజీ సీఎం జగదీష్ శెట్టర్ ను ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇస్తారని జోరుగా ప్రచారం జరిగింది. ఎమ్మెల్సీ పదవి కోసం పోటీ పడుతున్న కొందరు నాయకులు ఈ విషయం తెలుసుకుని నిరాశ చెందుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మాజీ సీఎం జగదీష్ శెట్టర్ విషయంలో ఊహించని నిర్ణయం తీసుకుందని వెలుగు చూసింది. మనల్ని నమ్ముకుని బీజేపీ వదిలేసి మన పార్టీలో చేరిన జగదీష్ శెట్టర్ కు న్యాయం చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ధారవాడ జిల్లాలో లింగాయత్ కులంలో సరైన నాయకుడు చిక్కలేదని ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ అయోమయంలో పడింది. అయితే మాజీ సీఎం జగదీష్ శెట్టర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వెయ్యి ఎనుగుల బలం వచ్చిందని కాంగ్రెస్ పార్టీ అనుకుంది. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం అని రాజకీయ నాయకులు అనుకుంటారు. అలాగే జగదీష్ శెట్టర్ కూడా అనుకున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఒత్తిడితో ఇష్టం లేకున్నా కర్ణాటక మాజీ మంత్రి వినమ్ కులకర్ణి ఓడిపోయారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో మరోసారి పోటీ చెయ్యడానికి వినయ్ కులకర్ణి సిద్దంగా లేరని తెలిసింది. మహేష్ టింగినకాయ చేతిలో ఓడిపోయిన మాజీ సీఎం జగదీష్ శెట్టర్ తో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఫోన్ లో మాట్లాడిందని తెలిసింది. మీరు 2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి సిద్దంగా ఉండాలని మాజీ సీఎం జగదీష్ శెట్టర్ కు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సూచించిందని తెలిసింది. హుబ్బళి-ధారవాడ జిల్లాలో లింగాయత్ కులం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడేలా చూడాలని జగదీష్ శెట్టర్ కు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సూచించిందని తెలిసింది. తనకు ఎమ్మెల్యే టిక్కెట్ దక్కకపోవడానికి బీజేపీ సీనియర్ నేత బీఎల్, సంతోష్, కేంద్ర మంత్రి ప్లహ్లాద్ జోషి కారణం అని మాజీ సీఎం జదీష్ శెట్టర్ బహిరంగంగానే విమర్శించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే జగదీష్ శెట్టర్ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మీద పోటీ చెయ్యడానికి ఇప్పటి నుంచే సిద్దం అవుతున్నారని తెలిసింది. మొత్తం మీద రాజకీయంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ సిద్దం అవుతున్నారని కన్నడ మీడియా అంటోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)