పప్పు ధాన్యాల పంటలకు ఆల్కహాల్ పిచికారీ !

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్ లోని  నర్మదాపురం రైతులు వేసవి పెసర పంటల ఉత్పత్తిని రెట్టింపు చేయడానికి దేశీ మద్యాన్ని ఉపయోగిస్తున్నారు. పంటపై మద్యాన్ని పిచికారీ చేయడం వల్ల రెండు రెట్లు దిగుబడి పెరుగుతుందని రైతులు చెబుతున్నారు. ఈ సాంకేతికత వల్ల పంట దిగుబడి పరిమాణమే కాకుండా నాణ్యత కూడా పెరుగుతుందని రైతులు నమ్ముతున్నారు. మద్యాన్ని పిచికారీ చేయడం వల్ల పంట కూడా మనుషుల మాదిరిగానే మత్తులోకి వెళ్తుందని రైతులు చెప్పడం అందర్నీ ఆశ్చర్యాన్నికలిగిస్తోంది. ఈ మద్యం మత్తులోనే పంటలు బోర్లు వేయకుండానే రెట్టింపు దిగుబడి ఇస్తున్నాయని రైతులు చెబుతున్నారు. ఒక్క నర్మదాపురంలోనే కాదు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఈ కొత్త టెక్నిక్‌ని ఉపయోగించుకోవడం మెల్లగా మొదలుపెట్టారు. తమ పప్పు ధాన్యాల పంటలకు ఆల్కహాల్ పిచికారీ చేసే విధానం కూడా చాలా సులభమని రైతులు అంటున్నారు. దేశీ మద్యాన్ని తీసుకుని స్ప్రే పంపులో నీళ్లతో కలుపుతున్నారు. ఆ తరువాత, వారు ఈ మిశ్రమాన్ని పంటలపై పిచికారీ చేస్తారు. ఆల్కహాల్‌ను స్ప్రే చేయడం వల్ల తమ శరీరానికి ఎలాంటి హాని జరగదని, అయితే దాని దుర్వాసన వల్ల మాత్రం తరచుగా అనారోగ్యానికి గురవుతారని వారు చెబుతున్నారు. ముఖ్యంగా పెసర పంటలో ఆల్కహాల్ మిశ్రమాలు వాడటం వల్ల ఉత్పత్తి పెరుగుతుందని రైతు పంకజ్ పాల్ తెలిపారు. దీంతో పాటు ఖర్చు కూడా చాలా తక్కువ అని, సుమారు 100 ml ఆల్కహాల్ ను 20 లీటర్ల నీటిలో కలిపితే సరిపోతుందంటున్నారు. పంటల సాగుకు మందు కంటే మద్యమే మంచిదని రైతులు నమ్ముతున్నారు. మరోవైపు, సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్త కెకె మిశ్రా ఈ తరహా సాగు ప్రక్రియను అంగీకరించలేదు. 

Post a Comment

0Comments

Post a Comment (0)