కుమార్తె మృతదేహాన్ని బైక్​పై తీసుకెళ్లిన తండ్రి !

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్​లోని కోట గ్రామానికి చెందిన లక్ష్మణ్​ సింగ్​, తన కుమార్తె మాధురి కి అనారోగ్యంగాఉండటంతో షాడోల్​ ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్​ చేశాడు. అక్కడ చికిత్స పొందుతూ మాధురి మరణించింది. మృతదేహాన్ని తరలించడానికి ఆసుపత్రి అధికారులకు అంబులెన్స్​ని అడగ్గా వాళ్ల ఊరు 70 కి.మీ.ల దూరంలో ఉండటంతో, 15 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్న ప్రాంతాలకు వాహనాలు అందుబాటులో లేవని చెప్పారు. మృతదేహం తరలింపునకు ప్రైవేటు అంబులెన్స్​ఎక్కువగా డబ్బులు అడగటంతో తండ్రి దిక్కు తోచని స్థితిలో బంధువు సాయంతో తన బైక్​ పై మృతదేహం తీసుకెళ్లారు. తండ్రి దయనీయ పరిస్థితిని పట్టించుకోని అధికారులపట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం విషయం తెలుసుకున్న షాడోల్​ కలెక్టర్​ వందనా అంబులెన్స్​ని ఏర్పాటు చేసి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలింపజేశారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)