పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

Telugu Lo Computer
0


పశ్చిమ బెంగాల్ లో శుక్రవారం మాల్దా పట్టణంలో జరిగిన బాణాసంచా పేలుడులో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు ఇటీవలి నివేదికలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ మీడియా నివేదికను సుమోటగా కేసును పరిగణలోకి తీసుకుంది. దీంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి మరియు పోలీసు చీఫ్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. రాష్ట్రంలో ఇలాంటి మూడు పేలుళ్లు జరిగాయని, ఎనిమిది రోజుల్లో 16 మంది మరణించారని కమిషన్ తెలిపింది. మే 23, 2023న పశ్చిమ బెంగాల్‌లో జరిగిన మరో బాణసంచా పేలుడులో మాల్దా పట్టణంలో ఇద్దరు వ్యక్తులు మరణించారని ఒక మీడియా రిపోర్ట్ ను ఎన్‌హెచ్‌ఆర్‌సీ పరిగణలోకి తీసుకుంది. స్థానికులు బాణాసంచా మరియు కార్బైడ్‌లను అక్రమంగా నిల్వ ఉంచారని ప్రశ్నించింది. పోలీసు స్టేషన్, మునిసిపాలిటీకి కొద్ది మీటర్ల దూరంలోనే ఈ ఘటన జరిగిందని పేర్కొంది. ఇలాంటి ఘటనలపై రాష్ట్ర అధికారుల పర్యవేక్షణ కొరవడిందని, ఫలితంగా ఇలాంటి ఘటనలు పదేపదే జరుగుతున్నాయని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఒక ప్రకటనలో పేర్కొంది. దీని ప్రకారం, ఎన్‌హెచ్‌ఆర్‌సి పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీ మరియు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌లకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో వివరణాత్మక నివేదికను ఇవ్వాలని కోరింది. నివేదికలో పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్.. బాధితులకు వైద్యం మరియు పరిహారం ఏదైనా ఉంటే, మరణించిన వారి బంధువులకు మరియు గాయపడిన వారికి మంజూరు చేయాలి అని తెలిపింది. దుర్ఘటనకు బాధ్యులైన అధికారులపై తీసుకున్న చర్యల గురించి కూడా వివరణ ఇవ్వాలని కమిషన్ తెలిపింది. ఎన్‌హెచ్‌ఆర్‌సి ఇటీవల పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మెదినిపూర్ జిల్లాలో ఇదే విధమైన సంఘటనను సుమోటగా కేసును స్వీకరించింది, అక్కడ అక్రమ బాణసంచా కర్మాగారంలో జరిగిన పేలుడులో దాదాపు తొమ్మిది మంది మరణించారు. ఈ ఘటనలో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)