జున్‌జున్‌వాలా స్టాక్ ఒక్కరోజే రూ.500 కోట్లు ఆవిరి !

Telugu Lo Computer
0


స్టాక్ మార్కెట్ బుల్ దివంగత రాకేష్ జున్‌జున్‌వాలా మనమధ్య లేనప్పటికీ ఆయన ఆలోచనలు ఇన్వెస్టర్లను నడిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ ఆయన ఇన్వెస్ట్ చేసిన కంపెనీలను, పోర్ట్ ఫోలియోను చాలా మంది ఫాలో అవుతూనే ఉన్నారు. ఈ క్రమంలో రాకేష్ జున్‌జున్‌వాలా ఫ్యామిలీ పెట్టుబడులు పెట్టిన స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ షేర్లు శుక్రవారం భారీగా పతనమయ్యాయి. ఒక్కరోజే షేర్ల ధర ఏకంగా 10 శాతం మేర క్షీణించింది. కంపెనీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవ్వటంతో సంపద ఆవిరైంది. ఇన్సూరెన్స్ స్టాక్ క్షీణత కారణంగా రేఖా జున్‌జున్‌వాలా ఒక్కరోజే ఏకంగా రూ.500 కోట్లు పోగొట్టుకున్నారు. పైగా రేఖా సంస్థ ఈ కంపెనీకి అతిపెద్ద ప్రమోటర్లలో ఒకరుగా ఉన్నారు. వారాంతపు ట్రేడింగ్ ముగి సమయానికి స్టాక్ ధర రూ.534.95గా నిలిచింది. ఇంట్రాడేలో స్టాక్ కనిష్ఠంగా రూ.531.70ను తాకింది. దీనికి ముందు గురువారం కంపెనీ షేర్లు రూ.583.95 ధర వద్ద ముగిశాయి. స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ మార్చి షేర్‌హోల్డింగ్ ప్రకారం.. రేఖా జున్‌జున్‌వాలా తన భర్త రాకేష్ జున్‌జున్‌వాలా 14.25 శాతంతో పాటు 3.07 శాతం వాటాలను కలిగి ఉన్నారు. అంటే జున్‌జున్‌వాలా ఫ్యామిలీకి స్టార్ హెల్త్‌లో మెుత్తంగా 17.32 శాతం వాటా ఉంది. శుక్రవారం నాటి రేటు ప్రకారం రేఖా జున్‌జున్‌వాలా కంపెనీలో మొత్తం రూ.5,883.53 కోట్ల విలువైన పెట్టుబడులను కలిగి ఉన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)